Headlines

RK Roja: రెడ్‌బుక్‌లో జగన్ తర్వాత.. ఉన్నది ఆ పేరే.. Tv9 క్రాస్‌ఫైర్‌లో రోజా సంచలన వ్యాఖ్యలు!

RK Roja: రెడ్‌బుక్‌లో జగన్ తర్వాత.. ఉన్నది ఆ పేరే.. Tv9 క్రాస్‌ఫైర్‌లో రోజా సంచలన వ్యాఖ్యలు!


టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ తెచ్చిన రెడ్‌బుక్‌లో ఆమె పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడిందని, జగన్ గారి తర్వాత తన స్థానమే ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఆమె ఇప్పటికీ స్వేచ్ఛగా ఉండడం, అరెస్టు కాకపోవడం చాలా మందికి సస్పెన్స్ గా ఉందని వ్యాఖ్యానించారు. రెడ్ బుక్ లో తన పేజీని చంద్రబాబు నాయుడే చింపేసి ఉంటాడని రోజా ఆరోపించారు, కాల్ మనీ సెక్స్ రాకెట్ పై తాను పోరాటం చేస్తున్నప్పుడు అసెంబ్లీలో నియమాలకు విరుద్ధంగా తనను ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. మహిళా పార్లమెంట్ కు రానివ్వకుండా పోలీసులతో కిడ్నాప్ చేయించి అవమానించినప్పుడు తాను ఒక ప్రెస్ మీట్ పెట్టినట్లు ఆమె వివరించారు. ఆరోజే తాను ఆడవాళ్ల గురించి మాట్లాడినట్లు పేర్కొన్నారు.

మాజీమంత్రి శివప్రసాద్ కోరితే 1999లో టీడీపీ కోసం ప్రచారం చేశానని.. గతంలో పదేళ్లపాటు టీడీపీ కోసం ఎంతో కష్టపడి పని చేశానన్నారు. కానీ విభేదాలు రావడంతో టీడీపీ నుంచి బయటకు రావాలని అనుకున్నానన్నారు. అప్పటి నుంచి తనపై ఐరన్ లెగ్ ముద్ర వేయాలని అనుకున్నారన్నారు. అందుకే టీడీపీతో తనకు ఎలాంటి పేగుబంధం లేదన్నారు. తనను ఏదైనా చేయాలని అనుకుంటే దొంగదెబ్బ తీయాల్సిందేనని.. లేకపోతే ఏ విధంగానే తనను అరెస్ట్ చేసే అవకాశం లేదన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *