Anushka Shetty : ఆ హీరో నాకు చాలా చాలా స్పెషల్.. జీవితంలో ఒక గాడ్ ఫాదర్.. అనుష్క శెట్టి..

Anushka Shetty : ఆ హీరో నాకు చాలా చాలా స్పెషల్.. జీవితంలో ఒక గాడ్ ఫాదర్.. అనుష్క శెట్టి..


మొదట వెనుకాడినా, మళ్లీ అవకాశం వచ్చినప్పుడు, తన చుట్టూ ఉన్నవారు ప్రోత్సహించడంతో పూరి జగన్నాథ్ ని కలిశారు. చిన్నప్పటి నుండి సినిమాలను, టీవీని చూడని అనుష్కకు పోర్ట్‌ఫోలియో చిత్రాలు ఉండాలనే విషయం తెలియదు. కలిసినప్పుడు ఫోటో ఉందా అని అడిగితే, పర్సులో ఉన్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను ఇచ్చారట. అయినప్పటికీ, పూరి జగన్నాథ్ ఆమె అమాయకత్వాన్ని మెచ్చుకుని నవ్వారట. మరుసటి రోజు హైదరాబాద్ రమ్మని పిలిచారు, అయితే ఆమెకు యోగా క్లాసులు ఉన్నందున రాలేనని, శుక్రవారం వస్తానని చెప్పడంతో ఒక స్నేహితురాలు “అది వాళ్లకు ఆటిట్యూడ్ లాగా అనిపిస్తుంది” అని హెచ్చరించిందట. అయితే అది తన అమాయకత్వం అని అనుష్క తెలిపారు. గురువారం సాయంత్రం పూరి జగన్నాథ్ మళ్లీ ఫోన్ చేసి, క్లాసులు అయ్యాక రమ్మని చెప్పడంతో హైదరాబాద్ వెళ్లారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *