Headlines

Ravi Teja: అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. నెట్టింట వీడియో హల్ చల్

Ravi Teja: అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. నెట్టింట వీడియో హల్ చల్


ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. అయితే ఏడుగురు కాకపోయినా కనీసం ఒకరు, ఇద్దరు ఒకే పోలికలతో ఉన్న వ్యక్తులు అప్పుడప్పుడు మనకు తారసపడుతుంటారు. ఎలాంటి రక్త సంబంధం బంధుత్వం లేకున్నా ఒకే పోలికలతో కనిపించే వ్యక్తులు అక్కడక్కడ కనిపిస్తుంటారు. సాధారణంగా ఇలాంటి వారిని ఇంగ్లిష్ లోడొపెల్ గ్యాంగర్స్ లేదా ట్విన్ స్ట్రేంజర్స్ అని పిలుస్తుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇలా ఒకే పోలికలు ఉన్న వ్యక్తులు మనకు ఎక్కువగా కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలోనూ వీరి ఫొటోలు, వీడియోలు తెగ వైరలవుతుంటాయి. గతంలోఐశ్వర్యారాయ, అనుష్కా శర్మ, సమంత, మహేష్ బాబులను పోలిన వ్యక్తులు సోషల్ మీడియాలో బాగా హైలెట్ అయ్యారు. రీసెంట్ గానే మలేషియాలో ఒక వ్యక్తి సేమ్ టు సేమ్ అచ్చం మన బాలయ్య బాబులాగే కనిపించాడు. అతనికి సంబంధించిన వీడియోలు కూడా బాగా వైరలయ్యాయి. అలా ఇప్పుడు అచ్చం మన మాస్ మహారాజా రవితేజలా ఉన్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాడు. రవితేజకు అచ్చం జిరాక్స్ కాపీలా కనిపిస్తోన్న అతనెవరో తెలియదు కానీ వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. రవితేజ సినిమాల్లో ఇతనిని డూప్ గా పెట్టుకోవచ్చు కదా అని కామెంట్స్ పెడుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ప్రేక్షకుల ముందుక వచ్చాడు రవితేజ. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ప్రస్తుతం ఇరుముడి అనే ఓ డివోషనల్ మూవీలో నటిస్తున్నాడు మాస్ మహరాజా. నిన్నుకోరి, మజిలీ వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఆగస్టు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి



వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *