Ravi Babu : 12 ఏళ్లుగా నా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అందుకే ఇలా ఉన్నాను.. డైట్ సీక్రెట్ చెప్పిన రవి బాబు..

Ravi Babu : 12 ఏళ్లుగా నా బ్రేక్ ఫాస్ట్ ఇదే.. అందుకే ఇలా ఉన్నాను.. డైట్ సీక్రెట్ చెప్పిన రవి బాబు..


నటుడు రవిబాబు తన అద్భుతమైన శరీరాకృతికి గల రహస్యాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మురారి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల సమయం నుండి ఇప్పటికీ తన శరీరాకృతిలో ఎటువంటి మార్పు లేకపోవడంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, ఇది గాడ్స్ గిఫ్ట్, జెనెటిక్స్ అని మొదట పేర్కొన్నారు. తన తండ్రి మాదిరిగానే తనకు మద్యం అలవాటు లేదని, అయితే సిగరెట్లు కాలుస్తానని తెలిపారు. తన తండ్రికి లేని ఒక అలవాటు తనకు ఉంటే అది వెయిట్ ట్రైనింగ్ అని, చిన్నతనం నుంచే తనకు వెయిట్ ట్రైనింగ్ అలవాటు ఉందని, ఇప్పటికీ అది కొనసాగుతోందని వివరించారు. రవిబాబు దినచర్య అత్యంత క్రమశిక్షణతో కూడుకుని ఉంటుంది. ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు నిద్రపోతారు, తెల్లవారుజామున 3:30 గంటలకు మేల్కొంటారు. అరగంట పాటు తన బాల్కనీలో బ్లాక్ కాఫీ తాగుతూ, సిగరెట్ కాలుస్తూ, నగరాన్ని చూస్తూ తన వ్యక్తిగత సమయాన్ని ఆస్వాదిస్తారు. ఈ సమయం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం 4:30 లేదా 4:45 గంటలకు జిమ్‌కు వెళ్లి, 6:00 లేదా 6:15 గంటల వరకు వ్యాయామం చేస్తారు. ఈ మార్నింగ్ రొటీన్ ఎప్పుడూ మారదని ఆయన తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..

ఆహార నియమాల విషయానికొస్తే, రవిబాబు సుమారు 12 సంవత్సరాలుగా ఒకే రకమైన బ్రేక్‌ఫాస్ట్‌ను తీసుకుంటున్నారు. అదే గుడ్డు తెల్లసొన ఆమ్లెట్. ఒకే రకమైన ఆహారం, ఒకే పరిమాణంలో తీసుకోవడంలో తాను ఎంతో క్రమశిక్షణతో ఉంటానని అన్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనమైనా, ఏది తీసుకున్నా క్వాంటిటీలో ఎటువంటి మార్పు ఉండదని చెప్పారు. లేట్ నైట్ షూటింగ్‌లు ఉన్నప్పటికీ, వీలైనంతవరకు ఆయిల్ ఫుడ్స్, రాత్రిపూట భారీ భోజనాలకు దూరంగా ఉంటానని, అనవసరంగా రాత్రులు మెలకువగా ఉండటం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని రవిబాబు నమ్ముతారు. వ్యాయామం, విశ్రాంతి, స్థిరమైన ఆహారం ఈ మూడింటిని నిలకడగా కొనసాగించడం వల్లే శరీరాకృతి స్థిరంగా ఉంటుందని ఆయన వివరించారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : రూ.5 వేలకు స్కూల్లో టీచర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..

వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తన ప్రపంచం సినిమా, ఇల్లు మాత్రమే అని రవిబాబు స్పష్టం చేశారు. పార్టీలకు వెళ్లినా త్వరగా బయటకు వచ్చేస్తానని చెప్పారు. పెళ్లిళ్లు, సినిమా ఫంక్షన్లకు హాజరయ్యే విషయంలో ఆయనకు కొన్ని కఠిన నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిగతంగా వచ్చి ఆహ్వానించిన పెళ్లిళ్లకు మాత్రమే వెళ్తానని, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా ఆహ్వానాలు పంపితే హాజరుకాబోనని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆహ్వానంలో ఒక పర్సనల్ టచ్ ఉండాలని, లేకపోతే అది కేవలం సమాచారం మాత్రమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *