కన్నడ ఇండస్ట్రీ నుంచి మొదలై టాలీవుడ్ మీదుగా బాలీవుడ్‌లో జెండా పాతేస్తున్నారు మిసెస్ దేవరకొండ. తాజాగా రష్మిక ఖాతాలో మరో రికార్డు చేరిపోయింది. ఆల్రెడీ నేషనల్ క్రష్ అనిపించుకున్న ఈ బ్యూటీ.. తాజాగా అదే నిజం చేస్తూ దేశంలోనే నెంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచారు. మరి రష్మిక మందన్న సాధించిన రికార్డ్ ఏంటి..? దీపిక, అలియా లాంటి బ్యూటీస్ కూడా ఎందుకు వెనకబడ్డారు..? పుష్పలో శ్రీవల్లిగా నేషనల్ వైడ్ అందర్నీ తన వైపు తిప్పుకున్న రష్మిక.. ఆ తర్వాత యానిమల్ సినిమాతో హిందీలోనూ మాయ చేసారు. మూడేళ్ళ కింద వచ్చిన వచ్చిన పుష్ప 2తో తన పాపులారిటీని అమాంతం పెంచేసుకుని ప్యాన్ ఇండియా బాక్సాఫీస్ క్వీన్‌గా నిలిచారు. ఈ వరుస హిట్ల వల్లే రష్మిక ఇప్పుడు సౌత్, నార్త్ అనే తేడా లేకుండా నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుని అందరి ఫేవరెట్‌గా సెటిల్ అయిపోయారు. ఛావా లాంటి చారిత్రక నేపథ్యపు సినిమాలతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో వచ్చిన కుబేర, గర్ల్‌ఫ్రెండ్ లాంటి సినిమాలతో రష్మిక రేంజ్ మామూలుగా లేదిప్పుడు. మాస్ ఎంటర్‌టైనర్స్ నుంచి ఇంటెన్స్ డ్రామాల వరకు అన్ని రకాల పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు సాలిడ్‌గా కనెక్ట్ అయ్యారు. ఒక భాషకు లేదా జోనర్‌కు పరిమితం కాకుండా.. ప్రతి సినిమాలో తన వేరియేషన్స్ చూపిస్తూ స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో దీపికా పదుకొనే, అలియా భట్, శ్రద్ధా కపూర్, సాయిపల్లవి లాంటి స్టార్స్‌ను వెనక్కి నెట్టి మరీ రష్మిక టాప్ ప్లేస్‌లోకి వచ్చారు. ఈ సర్వేలో రష్మిక నెంబర్ వన్‌గా నిలిచారు. సౌత్ టూ నార్త్ ఇండియన్ సినిమాలో చక్రం తిప్పుతున్నారు. ప్రస్తుతం మైసా, రణబాలితో బిజీగా ఉన్నారు రష్మిక. వీటితో పాటు కొత్త కథలు కూడా వింటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం.. ఆ కుటుంబం ఏం చేసిందో మీరే చూడండి!
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్.. ఏకంగా ఇంటి పైకప్పుపై మహీంద్రా స్కార్పియో
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్‌ఎంపీ డాక్టర్.. రాత్రయితే..