టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడికల్ డ్రామా చిత్రం ‘రణబాలి’. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ మూవీ ప్రేక్షకుల్లో అపారమైన అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం “నెవర్ ఫర్గెట్ – ది ట్రూత్ సిరీస్” (Never Forget – The Truth Series) పేరిట ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలను ఇదివరకే చిత్రయూనిట్ ప్రకటించింది.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: నిజమైన కథతో వచ్చిన 8 ఎపిసోడ్స్ సిరీస్.. 60 దేశాలలో నంబర్ వన్.. ఒక్కసారి చూస్తే అస్సలు వదలరు..
తాజాగా విడుదలైన ఈ సిరీస్ మొదటి భాగం ‘Truth 1: The Famine We Forgot’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. బ్రిటిష్ పాలన కాలంలో భారతదేశం ఎదుర్కొన్న అత్యంత భయంకరమైన కరువు కాటకాలను, దాని వెనుక ఉన్న చారిత్రక వాస్తవాలను ఈ వీడియోలో ఎంతో అద్భుతంగా వివరించారు. బ్రిటిష్ పాలకుల దోపిడీ విధానాల వల్ల నాడు మన దేశంలో సంభవించిన ఘోరమైన కరువుల పరిస్థితులను ఈ డాక్యుమెంటరీ ద్వారా చూపించారు. ‘రణబాలి’ చిత్ర కథనం బ్రిటిష్ పాలనా కాలం నాటి చారిత్రక సంఘటనల ఆధారంగా సాగుతుందని, ఆనాటి ప్రజల ఆవేదన మరియు పోరాటాలను ఆవిష్కరిస్తుందని ఈ వీడియో స్పష్టం చేస్తోంది.
ఎక్కువ మంది చదివినవి : Roja: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయనతో చాలా సినిమాలు చేశా.. హీరోయిన్ రోజా..
కేవలం వినోదమే కాకుండా, మన చరిత్రలో దాగివున్న నిజాయితీ గల నిజాలను ఎంతో భావోద్వేగంగా వెండితెరపై ఆవిష్కరించబోతున్నట్లు ఈ వీడియో ద్వారా మేకర్స్ సంకేతాలు ఇచ్చారు. విజయ్ దేవరకొండ , రష్మిక కాంబినేషన్, దానికితోడు చారిత్రక నేపధ్యంతో కూడిన గ్రిప్పింగ్ కథాంశం ఉండటంతో ఈ సినిమాపై సినీ అభిమానులలో భారీ క్రేజ్ నెలకొంది. తాజాగా విడుదలైన ఈ ‘ట్రూత్ 1’ డాక్యుమెంటరీ వీడియో సోషల్ మీడియాలో విశేష ఆదరణ పొందుతూ వైరల్ అవుతోంది.
ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోయిన్ అంటే చాలా ఇష్టం.. ఆమె నుదుటన సూది మొనంత ప్రేమ రాయలేదు ఆ దేవుడు..
రణబాలి..
ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంది రా బాబూ పాట.. 2 రోజులుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. డీజేలో మోత మోగిపోద్ది..