Headlines

Andhra Pradesh: పింఛన్‌దారులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. చేతికి డబ్బులు అప్పుడే.. ప్రభుత్వం బిగ్ డెసిషన్..


ఏపీలోని పింఛనుదారులకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. పించన్లను ఎప్పటిలాగే ఉదయం నుంచే పంపిణీ చేయనుంది. అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే ఇళ్ల వ‌ద్దే పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు నేరుగా లబ్దిదారులకు ఇంటి వద్దను పింఛన్ సొమ్ము చేతికి అందించనున్నారు. మధ్యాహ్నం నుంచి కాకుండా ఉదయం నుంచే పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బ్యాంకర్ల సమ్మె విరమణతో యథాతథంగా పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ నెల పింఛన్ల కోసం రూ.2,692.34 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. రాష్ట్రంలోని 61.80 లక్షల మంది పింఛనుదారులకు 1వ తేదీన ఉదయం నుంచే పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఉదయం నుంచే పించన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించారు.

ప్రతీ నెలా ఒకటో తేదీన సీఎం చంద్రబాబు స్వయంగా ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ సారి బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్నాయి. లబ్దిదారులు పింఛన్లను పంపిణీ చేయనుండగా.. అనంతరం ప్రజావేదిక బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. రేపల్లెలో చంద్రబాబు పర్యటనకు ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజావేదిక స్థలం పరిశీలన ఇప్పటికే చేపట్టగా.. హెలీప్యాడ్, ఇతర అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వాహనాల పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఏర్పాట్లపై అధికారులు చర్చించారు. ప్రజలు సభలో పాల్గొనేలా అవసరమైన ఏర్పాట్లు చేయనున్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సభలో పాల్గొనేలా ఏర్పాటు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా చంద్రబాబు పర్యటనపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు రేపల్లె ఎమ్మెల్యే, మంత్రి అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు. ఇక పలు శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించారు.

బ్యాంక్ ఉద్యోగులు 28వ తేదీ నుంచి 30 వరకు సమ్మెకు దిగుతున్నట్లు తొలుత ప్రకటించారు. ఆ తర్వాత రాత్రికి రాత్రి సమ్మెను విరమించుకుంటున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంలో చర్చలు జరిపిన అనంతరం సమ్మెపై వెనక్కి తగ్గారు. కేంద్రం సానుకూలం స్పందించడంలో సమ్మెను విరమించుకున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని కోరుతూ బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. మూడు రోజుల సమ్మె చేపడితే బ్యాంకులు మూతపడేవి. దీని వల్ల పించన్ల పంపిణీకి కూడా అంతరాయం ఏర్పడే అవకాశముండేది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *