Headlines

Ramayana: రామాయణ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం అదేనా..?

Ramayana: రామాయణ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం అదేనా..?


రామాయణ ట్రైలర్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మేకర్స్ ఎందుకు ఇలా సడెన్ షాక్ ఇచ్చారు..? కామిక్ కాన్ వేదికగా ఉదయం 8 గంటలకే రావాల్సిన ఈ ట్రైలర్ అనూహ్యంగా ఎందుకు వాయిదా పడింది..? హాలీవుడ్ సినిమా కారణంగానే ఈ ట్రైలర్ లాంచ్ పోస్ట్ పోన్ అయిందా..? రామాయణ ట్రైలర్ రిలీజ్ ఆగిపోవడానికి ఆ హాలీవుడ్ సినిమాకు ఉన్న సంబంధం ఏంటి..? రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ కాంబినేషన్‌లో వస్తున్న రామాయణ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. శాన్ డియాగో కామిక్ కాన్ వేదికగా ట్రైలర్ లాంచ్ ఉంటుందని ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో.. చివరి నిమిషంలో మేకర్స్ ఈ ట్రైలర్ లాంచ్‌ను వాయిదా వేస్తూ ప్రేక్షకులను కాస్త నిరాశపరిచారు. ట్రైలర్ రాకపోయినా మేకర్స్ అదిరిపోయే గుడ్‌న్యూస్ మాత్రం అందరితో పంచుకున్నారు. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ రామాయణ వరల్డ్‌వైడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సొంతం చేసుకుంది. దీనివల్ల రామాయణ సినిమా ప్రపంచవ్యాప్తంగా మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది.. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సోనీ పిక్చర్స్ డీల్ వల్లే ట్రైలర్ రిలీజ్ వాయిదా పడిందనే సరికొత్త ప్రచారం ఇండస్ట్రీలో నడుస్తోంది. జూలై 30న రాబోతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా స్క్రీనింగ్స్‌తో పాటు రామాయణ త్రీడీ ట్రైలర్‌ జత చేసేలా సోనీ పిక్చర్స్ ప్లాన్ చేస్తున్నారని.. గ్లోబల్ ఆడియన్స్‌కు ఒకేసారి రీచ్ అయ్యేలా మేకర్స్ ఈ మాస్టర్ ప్లాన్ వేశారని ప్రచారం జరుగుతుంది. రామాయణ చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యశ్ ఇందులో రావణుడిగా నటిస్తుండటమే కాకుండా.. నిర్మాతగానూ ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2026 దీపావళి పండుగ కానుకగా రామాయణ పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్

కెమెరామెన్‌కి బంపరాఫర్‌.. యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!

బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

Weather Update: దూసుకొస్తున్న వాయు‘గండం’.. దంచికొట్టనున్న వర్షాలు.. వచ్చే మూడు రోజులు ముసురే

Cyber Crime:పార్శిల్‌ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్‌ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *