Headlines

Ramayana: ‘రామాయణ్‌’లో యశ్.. రావణుడిని ఇంత అందంగా తీర్చిదిద్దింది ఈమెనే.. బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?


Ramayana: ‘రామాయణ్‌’లో యశ్.. రావణుడిని ఇంత అందంగా తీర్చిదిద్దింది ఈమెనే.. బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?

‘రామాయణ్’ జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. దీపావళి కానుకగా నవంబర్ 05న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. త్వరలోనే ఈ మూవీ ఈజీగా రూ.2000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీలో రణ్ బీర్ కపూర్ రాముడిగా నటించాడు. అలాగే సీతమ్మ పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయింది. ఇక రావణుడిగా యశ్ అదరగొట్టాడు. సినిమాలో ఈ పాత్రే బాగా హైలెట్ గా నిలిచిందంటున్నారు. ఈ పాత్రకు వస్తున్న ప్రశంసల దృష్ట్యా కొందరు ఈ ‘రామాయణాన్ని’ ‘రావణాయణం’ అని కూడా పిలుస్తున్నారు. మొత్తానికి ప్రస్తుతం ఎక్కడ చూసినా యశ్ పేరే వినిపిస్తోంది. రామయాణ్ లో తెరపై రావణుడిని చిత్రీకరించిన విధానం కూడా అద్భుతంగా ఉంది. ‘రావణుడి’గా యష్ పోషించిన పాత్రలో విభిన్న రూపాలు ఉన్నాయి. రావణుడు తపస్వి, యోధుడు, మహారాజు, ఋషి వంటి వివిధ రూపాల్లో కనిపిస్తాడు. ఈ రూపాలన్నింటి వెనుక ఉన్నది ఒక్కరే, ఆమే సానియా సర్ధారియా.

సానియా సర్ధారియా ఒక ప్రముఖ ఫ్యాషన్ ఆర్టిస్ట్ అలాగే సెలబ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్ కూడా. సానియా గత 11 సంవత్సరాలుగా యష్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఆమె యష్ సినిమా పాత్రలకే కాకుండా, అతని ఇతర షోల కోసం కూడా లుక్స్‌ను సిద్ధం చేస్తున్నారు. ‘KGF’లోని రాఖీబాయి లుక్‌తో మొదలుపెట్టి ‘టాక్సిక్’ సినిమా కోసం కూడా అనేక లుక్స్‌ను సిద్ధం చేశారు. ఇప్పుడు ఆమె ‘రామాయణం’ సినిమాలో యశ్ ను తెరపై అద్భుతంగా కనిపించేలా చేశారామె. ‘రామాయణ్’ సినిమా కోసం యష్ కాస్ట్యూమ్, ఆభరణాలు, హెయిర్‌స్టైల్ మొదలైనవాటిని ఎంపిక చేసుకోవడంపై సానియా మాట్లాడుతూ.. ‘యష్ ‘KGF’, ‘టాక్సిక్’ సినిమాలతో పోలిస్తే ఇది చాలా క్లిష్టమైన పాత్ర. రావణుడి పాత్ర రూపాన్ని డిజైన్ చేయడానికి మేము రావణుడి భిన్న వ్యక్తిత్వాలను ఆధారంగా చేసుకున్నాం. వీరత్వం, శివభక్తి, అహం, ధైర్యం, జ్ఞానం, ఆశయం వంటి అంశాల ఆధారంగా మేము ఆ పాత్ర దుస్తులు, రంగులు, ఆభరణాలను నిర్ణయించాం’ అని చెప్పుకొచ్చారు.

హీరో యశ్ తో సానియా..

 

View this post on Instagram

 

A post shared by Saniya Sardhariya (@saniyasardhariya)

‘రావణుడి పాత్ర కోసం తయారు చేసిన ఆభరణాలన్నీ ఆయుధాల స్ఫూర్తితో రూపొందించబడ్డాయి. రావణుడి కిరీటం కూడా అంతే. అతని దుస్తులను కూడా ఒక యోధుడి ఛాయలు ఎల్లప్పుడూ కనిపించేలా డిజైన్ చేశారు. రావణ తాండవ సన్నివేశం కోసం మేము దానిని పూర్తిగా భిన్నమైన ఆలోచనతో రూపొందించాం. అక్కడ మేము రావణుడిని కేవలం శివ భక్తుడిగా మాత్రమే డిజైన్ చేశాము’ అని సానియా చెప్పుకొచ్చారు. దశాబ్దానికి పైగా యశ్‌తో కలిసి పనిచేసిన తన అనుభవం గురించి మాట్లాడుతూ, సానియా ఇలా అన్నారు, “యశ్ చాలా స్వేచ్ఛ ఇస్తాడు. అతను ప్రధానంగా కోరుకునేది ఏమిటంటే కాస్ట్యూమ్ అనేది పాత్రకు సహజమైన రూపాన్ని ఇవ్వాలి. అతను కోరుకునేది అంతే’ అని సానియా అన్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Saniya Sardhariya (@saniyasardhariya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *