Rajamouli: ఆ సినిమా రిజెక్ట్ చేయడమే నువ్వు చేసిన అతి తప్పు.. ఆ హీరోయిన్‏కు రాజమౌళి కామెంట్.. చివరకు తన మూవీలోనే ఛాన్స్..

Rajamouli: ఆ సినిమా రిజెక్ట్ చేయడమే నువ్వు చేసిన అతి తప్పు.. ఆ హీరోయిన్‏కు రాజమౌళి కామెంట్.. చివరకు తన మూవీలోనే ఛాన్స్..


టాలీవుడ్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. అరుంధతి చిత్రంలో నటించే అవకాశాన్ని తాను ఎలా వదులుకున్నది, ఆ తర్వాత రాజమౌళి దీనిపై ఎలా స్పందించారు అనే విషయాలను వెల్లడించారు. మలయాళంలో అనేక చిత్రాలు చేసిన మమతా, తెలుగులో యమదొంగ చిత్రంతో అరంగేట్రం చేశారు. అయితే, యమదొంగ అవకాశం రాకముందే, సుమారు ఒకటిన్నర సంవత్సరం క్రితం, శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమాలో ప్రధాన పాత్రకు ఆమెకు అవకాశం లభించింది.

ఎక్కువ మంది చదివినవి : Gopichand : జయం సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. ఎలా ఖర్చు చేశానంటే.. గోపిచంద్ కామెంట్స్..

మమతా మోహన్‌దాస్ తన తొలి తెలుగు సినిమా అరుంధతి కావాల్సి ఉందని, దాని కోసం సంతకం చేసి ఆపై తప్పుకున్నానని చెప్పారు. ఆ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ గురించి తనకు ఏమీ తెలియదని, తాను మలయాళీని అని, బహ్రెయిన్‌లో పెరిగిన ఎన్నారై కావడంతో తెలుగు భాష, పరిశ్రమపై అవగాహన లేదని వివరించారు. మేనేజర్ సలహా మేరకు ఆ ప్రొడక్షన్‌కు ఆర్థిక సమస్యలు ఉన్నాయని, అది మంచిది కాదని భావించి భయపడ్డానని తెలిపారు. దీనితో అరుంధతి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. మమతా నిర్ణయం శ్యామ్ ప్రసాద్ రెడ్డిని తీవ్రంగా కలచివేసిందని, మూడు నెలల పాటు ఆయన తనను ఒప్పించేందుకు ప్రయత్నించారని తెలిపారు. అరుంధతి పాత్రకు తానొక్కటే సరైన అభ్యర్థి అని ఆయన బలంగా నమ్మారని మమతా గుర్తుచేసుకున్నారు. చివరికి ఆమె ఆ ప్రాజెక్ట్‌ను వదులుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : రూ.5 వేలకు స్కూల్లో టీచర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యునరేషన్.. పాన్ ఇండియా గ్లామరస్ హీరోయిన్..

సుమారు ఒకటిన్నర సంవత్సరం తర్వాత, మమతా నటించిన పోకిరి పిల్లా (డబ్బింగ్ సినిమా)ను చూసిన రాజమౌళి ఆమెను యమదొంగలోని ధనలక్ష్మి పాత్రకు ఎంపిక చేశారు. ఈ చిత్రం ద్వారానే మమతా మోహన్‌దాస్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. యమదొంగ చిత్రీకరణ సమయంలో రాజమౌళి అరుంధతి సినిమా గురించి ప్రస్తావించి, ఆ చిత్రం వదులుకోవడం ఆమె చేసిన పెద్ద తప్పు అని చెప్పారని మమతా తెలిపారు. రాజమౌళి ఆ మాట చెప్పినప్పుడు అరుంధతి ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, అయితే అప్పుడే ఆ చిత్రం ఎంత పెద్ద విజయం సాధిస్తుందో సినీ పరిశ్రమలోని అందరికీ తెలుసని మమతా పేర్కొన్నారు. ఆ సినిమాలోని హీరోయిన్ పాత్ర ఒక నటి కెరీర్‌ను దశాబ్దాల పాటు నిలబెడుతుందని అప్పటికే చర్చ జరిగిందని మమతా మోహన్‌దాస్ వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi : రమ్య కృష్ణతో ప్రేమ, పెళ్లికి ఆ పాటనే కారణం.. డైరెక్టర్ కృష్ణ వంశీ..

మమతా మోహన్ దాస్ ఇన్ స్టా పోస్ట్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *