Headlines

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో


తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. వేడి, తీవ్రమైన ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఈ వారం చివరి నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ – నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, ఈ రోజు (మే 12, 2026) ఉదయం 0830 గంటలకు (IST) అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది రాగల 48 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉంది.

దీంతోపాటు తూర్పు గాలులలోని ద్రోణి ఇప్పుడు నైరుతి బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంత కేంద్రం నుండి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దక్షిణ అంతర కర్ణాటక – పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో నున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు తక్కువగా గుర్తించబడినది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి. :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 30-40కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30 -40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

రాయలసీమ :-

మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురు గాలులు గంటకు 40-50 కిలో మీటర్ల వేగముతో వీచే అవకాశముంది .

గమనిక :- కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం, రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం. ఈ వారాంతానికి నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. నిన్న ఉదయం నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల చక్రవాత ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast) ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (weather warnings):

ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *