Headlines

Prabhas: అందనంత ఎత్తులో ప్రభాస్ హ్యాట్రిక్ 100 కోట్ల రికార్డు

Prabhas: అందనంత ఎత్తులో ప్రభాస్ హ్యాట్రిక్ 100 కోట్ల రికార్డు


ఇండియన్ సినిమాలో ప్రభాస్‌కు మాత్రమే సాధ్యమైన ఆ రికార్డును అందుకునే నెక్ట్స్ హీరో ఎవరు..? షారుక్, ఎన్టీఆర్, రజినీకాంత్ లాంటి అగ్ర హీరోల వల్ల కూడా కాని ఈ హ్యాట్రిక్ రికార్డ్‌ను విజయ్ కూడా మిస్ చేసారు. దళపతి కచ్చితంగా ఈ రికార్డ్ బ్రేక్ చేస్తారేమో అనుకున్నారు కానీ కుదర్లేదు. అసలు బాక్సాఫీస్ దగ్గర ఎవరికీ అందనంత ఎత్తులో ప్రభాస్ సృష్టించిన ఆ రికార్డ్ ఏంటి..? కింగ్ ఆఫ్ ఓపెనింగ్స్ అని చాలా మంది హీరోలను అంటారు కానీ ప్రభాస్ మాత్రమే దీనికి న్యాయం చేస్తున్నారు. ఆదిపురుష్, సలార్, కల్కి సినిమాలతో వరసగా మూడుసార్లు మొదటి రోజే 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ తెచ్చిన ఏకైక హీరోగా చరిత్ర సృష్టించారు రెబల్ స్టార్. ఇండియాలో మరే ఇతర స్టార్ హీరోకు సాధ్యం కాని ఈ అరుదైన హ్యాట్రిక్ కేవలం ప్రభాస్ ఖాతాలో మాత్రమే భద్రంగా ఉండిపోయింది. ఈ 100 కోట్ల ఓపెనింగ్స్ హ్యాట్రిక్ కొట్టే ఛాన్స్ బాలీవుడ్ బాద్షా షారు‌క్‌కు వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. పఠాన్, జవాన్ సినిమాలతో వరసగా 100 కోట్లు కొల్లగొట్టిన కింగ్ ఖాన్‌కు డంకీ సినిమాతో ఊహించని విధంగా బ్రేక్ పడింది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్స్ చూసిన సూపర్ స్టార్ రజినీకాంత్‌కు కూడా ఈ హ్యాట్రిక్ 100 కోట్ల ఫీట్ సాధించడం సాధ్యం కాలేదు. ఎన్టీఆర్ కూడా ఈ 100 కోట్ల ఓపెనింగ్స్ హ్యాట్రిక్‌కు దగ్గరగా వచ్చి ఆగిపోయారు. RRR, దేవర సినిమాలతో మొదటి రోజే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన తారక్.. వార్ 2 మూవీతో హ్యాట్రిక్ చేరుకోలేదు. తాజాగా విజయ్ కూడా ఈ రికార్డ్ చేజార్చుకున్నారు. లియో, గోట్ సినిమాలతో మొదటిరోజే సెంచరీ కొట్టిన విజయ్.. తాజాగా ‘జన నాయగన్’ 100 కోట్ల ఓపెనింగ్ తీసుకురాలేదు. నెక్ట్స్ అల్లు అర్జున్‌కు మాత్రమే ఈ రికార్డ్ సాధ్యమయ్యేలా కనిపిస్తుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

PM Modi: లీకు వీరులకు మోదీ సర్కార్ మాస్టర్ స్ట్రోక్

కెమెరామెన్‌కి బంపరాఫర్‌.. యువకుడిని పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!

బంధువుల మెప్పు కోసం అంత ఖర్చు అవసరమా!

Weather Update: దూసుకొస్తున్న వాయు‘గండం’.. దంచికొట్టనున్న వర్షాలు.. వచ్చే మూడు రోజులు ముసురే

Cyber Crime:పార్శిల్‌ వచ్చింది.. రూ.22 పే చేయమని మెసేస్‌ వచ్చిందా.. అయితే.. బీ అలర్ట్!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *