Headlines

Post Office Scheme: భార్యాభర్తలకు పోస్టాఫీస్‌ బంపర్‌ ఆఫర్‌.. నెలకు రూ.50 వేలు పొందోచ్చు.. ఎలా అంటే..?


పదవీ విరమణ తర్వాత ఆర్ధిక భద్రత పొందేందుకు తాము కూడబెట్టిన డబ్బులను సురక్షితంగా ఉండేలా చూసుకోవడమే అవసరం. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లలో దాచుకోకుండా పెట్టుబడుల రూపంలో వివిధ పథకాల్లో పొదుపు చేసుకోవడం వల్ల రెట్టింపు ఆదాయం పొందవచ్చు. సురక్షితమైన పెట్టుబడి కోసం పోస్టాఫీస్ పథకాలు బాగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న పథకాల్లో పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, పోస్టాఫీస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్ బాగా ప్రజాదరణ పొందాయి. భార్య, భర్త ఇద్దరూ ఇందులో డబ్బులు పొదుపు చేసుకోవచ్చు. ఈ రెండు పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వడ్డీ రూపంలో ఎక్కువ పొందవచ్చు. ఈ పథకాల వడ్డీ రేట్లు, గరిష్ట పెట్టుబడి, ఇతర విషయాల గురించి తెలుసుకుందాం.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్

ఈ పథకంలో 60 సంవత్సరాల వయస్సు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు మాత్రమే పెట్టుబడి పెట్టడానికి అర్హులు. ప్రస్తుతం వడ్డీ రేట్లు 8.2 శాతంగా ఉంది. ఒక వ్యక్తి గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీంతో భార్యాభర్తలు చెరొక ఖాతా ఇందులో తెరవొచ్చు. ఇద్దరూ కలిసి రూ.60 లక్షలు ఇన్వెస్ట్ చేయవచ్చు. 8.2% వడ్డీ రేటుతో భార్యాభర్తలిద్దరూ సంవత్సరానికి చెరో రూ. 2,46,000 సంపాదిస్తారు. దీని ఫలితంగా వారి ఉమ్మడి వార్షిక ఆదాయం రూ. 4,92,000 అవుతుంది. SCSS కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. దంపతులు ప్రతి త్రైమాసికంలో మొత్తం రూ. 1,23,000 అందుకుంటారు. దీని సగటు నెలవారీ ఆదాయం రూ. 41,000 అవుతుంది.

నెలకు రూ.50 వేల ఆదాయం..

నెలవారీ ఆదాయాన్ని పొందేందుకు పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం (POMIS) ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ పథకం 7.4 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. వ్యక్తిగత ఖాతాలో గరిష్టంగా రూ.9 లక్షలు జమ చేయవచ్చు. ఉమ్మడి ఖాతాలో గరిష్టంగా రూ.15 లక్షల వరకు జమ చేయవచ్చు. భార్యాభర్తలు ఉమ్మడి ఖాతాలో రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే 7.4 శాతం వడ్డీ రేటుతో సంవత్సరానికి రూ.1,11,000 వడ్డీ లభిస్తుంది. ఈ మొత్తాన్ని 12 నెలల పాటు విభజిస్తే.. నెలకు రూ.9,250 ఆదాయం వస్తుంది. ఒకవేళ భార్యాభర్తలు SCSS (సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్)లో రూ.60 లక్షలు, POMISలో రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే మొత్తం రూ.75 లక్షల పెట్టుబడి అవుతుంది. ఈ విధంగా మొత్తం రూ. 75 లక్షల పెట్టుబడిపై ఏడాదికి రూ. 6,03,000 వడ్డీ లభిస్తుంది. దీనిని 12 నెలల పాటు పంపిణీ చేస్తే సగటున నెలకు రూ. 50,250 ఆదాయం వస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *