Headlines

రూ.500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!


రూ.500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!

హైదరాబాద్, నవంబర్ 29: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందుతున్న లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఈ పథకం ప్రయోజనం పొందుతున్న ఎల్పీజీ వినియోగదారులు తమ ఆధార్ వివరాలను అందజేయాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. అర్హులైన వారికే పథకం ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు శనివారం జీవో నంబర్ 19 జారీ చేసింది. లబ్ధిదారుల ఆధార్ వివరాలను ఆహార భద్రత (రేషన్) కార్డులతో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. తద్వారా పథకం ప్రయోజనాలు అర్హులైన కుటుంబాలకు మాత్రమే అందేలా చర్యలు చేపట్టనుంది.

ఆధార్ లేని వారు ఏం చేయాలి?

ఆధార్ కార్డు లేని వారు కూడా కొన్ని ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలతో పథకం ప్రయోజనాలు పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ముందుగా ఆధార్ కోసం నమోదు చేసుకుని, ఆ నమోదు రసీదుతో పాటు కింది గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించవచ్చు.

  • బ్యాంకు లేదా పోస్టాఫీసు ఫొటో పాస్‌బుక్
  • పాన్ కార్డు
  • పాస్‌పోర్టు
  • రేషన్ కార్డు
  • ఓటరు గుర్తింపు కార్డు
  • ఉపాధి హామీ కార్డు
  • డ్రైవింగ్ లైసెన్స్

ఈ పత్రాల్లో ఏదైనా ఒకటి చూపించి నిబంధనల ప్రకారం పథకం ప్రయోజనం పొందవచ్చు.

వేలిముద్రలు పడకపోతే ఏం చేయాలి?

కొంతమంది లబ్ధిదారులకు వృద్ధాప్యం లేదా ఇతర కారణాలతో వేలిముద్రలు సరిగా పడక ఆధార్ ధ్రువీకరణలో సమస్యలు ఎదురవుతుంటాయి. అలాంటి వారికి కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది. ముద్రల ద్వారా ఆధార్ ధ్రువీకరణ సాధ్యం కాకపోతే ఐరిస్ స్కానింగ్ లేదా ముఖ గుర్తింపు (Face Authentication) ద్వారా ధ్రువీకరణ చేసుకోవచ్చు. వి కూడా పనిచేయని సందర్భాల్లో కింది ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగించుకోవచ్చు.

ఆధార్ ఓటీపీ (OTP) విధానం.

  • టైమ్ ఆధారిత వన్ టైమ్ పాస్‌వర్డ్ (TOTP) విధానం.
  • ఆధార్ లేఖపై ఉన్న క్యూఆర్ కోడ్ (QR Code) ద్వారా వివరాల ధ్రువీకరణ.

ఈ విధానాల ద్వారా లబ్ధిదారుల గుర్తింపును నిర్ధారించి పథకం ప్రయోజనాలు అందించాలని ప్రభుత్వం సూచించింది. మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించే పథకంలో పారదర్శకత పెంచడంతో పాటు అనర్హులకు ప్రయోజనాలు అందకుండా చూడటమే ఈ కొత్త మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశం. అందుకే లబ్ధిదారుల ఆధార్ వివరాలను రేషన్ కార్డులతో అనుసంధానం చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. కాబట్టి రూ.500కే గ్యాస్ సిలిండర్ పొందుతున్న వినియోగదారులు ఆధార్ ధ్రువీకరణకు సంబంధించిన వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఆధార్ ధ్రువీకరణలో ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ పద్ధతులను వినియోగించుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *