Pooja Hegde: ప్రేమలో పడ్డ పూజా హెగ్డే.. ఆ హీరోతో బుట్టబొమ్మ రిలేషన్ షిప్..? త్వరలోనే

Pooja Hegde: ప్రేమలో పడ్డ పూజా హెగ్డే.. ఆ హీరోతో బుట్టబొమ్మ రిలేషన్ షిప్..? త్వరలోనే


టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించింది. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ అమ్మడి ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకుంది. దాంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ కరువయ్యాయి. ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ అందాల ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే తన అందంతో కట్టిపడేసింది పూజ హెగ్డే.. తక్కువ సమయంలోనే డమ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి మెప్పించింది. కెరీర్ మొదట్లో ప్లాపులే అందకున్నప్పటికీ అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి. దువ్వాడ జగన్నాథం, అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేష్, అలా వైకుంఠపురంలో వంటి చిత్రాలతో వరుసగా హిట్లు అందుకుంది. అయితే వరుస హిట్లే కాదు.. ఆ తర్వాత వచ్చిన ప్లాపులు అమ్మాడి కెరీర్ ను అయోమయంలో పడేశాయి. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో పూజా సైలెంట్ అయ్యింది.

ఇది కూడా చదవండి : Folk Song: ఎంతో అదృష్టం చేసుకుంటే నాకు ఆ పాట వచ్చింది.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాంగ్

తెలుగు, తమిళ్, హిందీల్లో సినిమాలు చేసినా కూడా హిట్స్ అందుకోలేకపోయింది.. దాంతో స్పెషల్ సాంగ్ వైపు అడుగులేసింది. స్పెషల్ సాంగ్స్ తో రచ్చ చేసిన ఈ అమ్మడు ఆఫర్స్ మాత్రం అందించుకోలేకపోయింది. ఇక పూజా హెగ్డే చివరిగా నటించిన జన నాయగన్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే పూజా హెగ్డే ప్రేమలో పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలోనూ పూజా ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడిందని గతంలో వార్తలు వచ్చాయి.

ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! సూర్య ఎత్తుకున్న ఈ చిన్నారి.. ఇప్పుడు అందంలో అప్సరస..

ఇక ఇప్పుడు ఈ అమ్మడు ప్రేమలో పడిందని టాక్ వినిపిస్తుంది. పూజ హెగ్డే , రోహన్ మెహ్రా ప్రేమలో ఉన్నారని బీ టౌన్ లో టాక్ వినిపిస్తుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి పలుసార్లు మీడియా కంట్లో పడ్డారు. ఈ ఇద్దరూ షికారులకు వెళ్లడం, రెస్టారెంట్లకు వెళ్లడం వంటివి చేస్తున్నారు. అలాగే ఈ ఇద్దరూ రిలేషన్ షిప్ లో చాలా సీరియస్ గా ఉన్నారని కూడా టాక్ వినిపిస్తుంది. ఈ ఇద్దరూ కలిసి ఒక్క సినిమాలోనూ నటించలేదు.. కానీ ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఈ ఇద్దరికీ పరిచయం ఏర్పడిందని తెలుస్తుంది. త్వరలోనే పూజాహెగ్డే తన రిలేషన్ షిప్ ను బయటపెడుతుందా అని ఆమె అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :నా భర్తకు తొమ్మిది మందితో ఎఫైర్.. మొత్తం బయటపెట్టిన సీరియల్ నటి

Pooja Hegde, Rohan Mehra

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *