కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ఆర్దిక సాయం అందిస్తోంది. మూడు విడతల చొప్పున వీటిని అందిస్తోంది. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున వీటిని రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేస్తోంది. ఇటీవల ప్రధాని మోదీ 22వ విడత సొమ్మును విడుదల చేశారు. ఇవి రైతుల అకౌంట్లలో ఇప్పటికే జమ అయ్యాయి. అయితే జమకానివారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు తమ రికార్డులను అప్డేట్ చేసుకునేందుకు రైతులకు కేంద్రం గడువు విధించింది. ఒకవేళ పీఎం కిసాన్ నగదు అకౌంట్లలో జమకానివారు అప్డేట్ చేసుకుంటే వెంటనే జమ అవుతాయని కేంద్రం వివరించింది. ఆన్లైన్ ద్వారా సింపుల్గా ఈ పని చేయవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం.
ఆన్లైన్ ద్వారా సులభంగా ఇలా..
-పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి
-హోమ్ పేజీలో కనిపించే అప్డేట్ మిస్సింగ్ ఇన్పర్మేషన్పై క్లిక్ చేయండి
-మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి
-సెర్చ్ అనే ఆప్షన్ ఎంచుకోండి
-పేరు, అడ్రస్, బ్యాంక్, ఇతర వివరాలను అప్డేట్ చేసుకోండి
-సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి
-అనంతరం సబ్మిట్ క్లిక్ చేయండి
-మీ వివరాలు కొద్ది రోజుల్లోనే అప్డేట్ అవుతాయి.
ఏప్రిల్ 30లోగా డెడ్ లైన్
ఏప్రిల్ 30వ తేదీలోగా మీరు వివరాలు అప్డేట్ చేసుకుంటే మీ అకౌంట్లో డబ్బలు జమ అవుతాయి. దీంతో డబ్బలుు జమ కానివారు ఈ పని చేయాలని కేంద్రం తెలిపింది. ఆగిపోయిన పీఎం కిసాన్ 22వ విడత నగదుతో పాటు ఇంతకముందు నిలిచిపోయిన డబ్బులన్నీ ఒకేసారి జమ అవుతాయి. ఇక తర్వాతి విడతల్లో కూడా మీకు నిలిచిపోకుండా వెంటనే జమ అవుతాయని అధికారులు చెబుతున్నారు. వివరాలు అసంపూర్ణంగా ఉండటం వల్ల చాలామంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ కావడం లేదు. దీంతో చాలామందికి కేంద్రం డబ్బులను నిలిపివేసింది. ఏప్రిల్ 30వ తేదీలోగా అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయకపోతే పోర్టల్ నుంచి పేరు శాశ్వతంగా తొలగించే అవకాశం కూడా ఉంటుంది. దీంతో రికార్డులు అప్డేట్ చేసుకోవాలని కేంద్రం సూచిస్తోంది. అయితే ఈకేవైసీ చేయకపోయినా లేదా వివరాలు సరిగ్గా లేకపోయినా పీఎం కిసాన్ నగదు అనేది ఆగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి.