Headlines

Pink Power Run 3.0: హైదరాబాద్‌లో పింక్ పవర్ రన్‌ 3.0కి భారీ స్పందన


మహిళల ఆరోగ్యం మరియు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే లక్ష్యంతో హైదరాబాద్‌లో ‘పింక్ పవర్ రన్ 3.0’ నిర్వహణకు సన్నాహాలు పూర్తయ్యాయి. సుధా రెడ్డి ఫౌండేషన్, MEIL ఫౌండేషన్ సంయుక్త నిర్వహించనున్న ఈ ‘పింక్ పవర్ రన్ 3.0 ఈ నెల 27న పీపుల్స్ ప్లాజా సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో వైభవంగా జరగనుంది. ఈ రన్ కోసం రూ.75 లక్షల భారీ ప్రైజ్ పూల్‌ను కేటాయించారు. ఈ రన్‌ను 3, 5, 10, మరియు 21 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు తమకు నచ్చిన కేటగిరీని ఎంచుకుని ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న రన్నర్లకు బిబ్, రన్ కిట్, బ్యాగ్ వంటివి అందజేస్తారు. అంతేకాకుండా, తొలుత నమోదు చేసుకున్న వారికి ప్రత్యేకంగా డెకాత్లాన్ సిప్పర్‌ను కానుకగా అందించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. రన్‌లో పాల్గొనే వారంతా ఉదయం 5.00 గంటలకల్లా వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. 21K రన్ ఉదయం 5:40 గంటలకు, 10K రన్ 6:30 గంటలకు, 5K రన్ 7 గంటల 10 నిమిషాలకు, అలాగే, 3K రన్ 7:45 కి ప్రారంభమవుతాయి. ఆరోగ్య స్పృహను పెంపొందించే ఈ రన్‌లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

EPFO: ఈపీఎఫ్ ఖాతాదారు మరణిస్తే కుటుంబానికి ఏ ప్రయోజనాలు అందుతాయి? క్లెయిమ్ ప్రక్రియ ఇదే!

Arunachalam: అరుణాచల కొండకు ప్రకృతి చికిత్స.. ఫలిస్తుందా!

BIS: ఇకపై స్క్రీన్ గార్డులకు BIS తప్పనిసరి

PhonePe: ఫోన్‌పే భారీ విస్తరణ.. 20,000 ఉద్యోగాలు

Vijayawada: ఏపీలో భారీ వర్షాలు ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *