Headlines

PhonePe: చిరు వ్యాపారులకు ఫోన్‌పే గుడ్‌న్యూస్‌..! ఇక నిమిషాల్లోనే ఆ పని పూర్తి!

PhonePe: చిరు వ్యాపారులకు ఫోన్‌పే గుడ్‌న్యూస్‌..! ఇక నిమిషాల్లోనే ఆ పని పూర్తి!


ఫోన్‌పే.. వ్యాపారాల కోసం చెల్లింపు వ్యవస్థల ఏకీకరణ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ కొత్త ఏఐ ఆధారిత టూల్‌ను ప్రారంభించింది. గతంలో వారాల తరబడి పట్టే పేమెంట్ గేట్‌వే ఇంటిగ్రేషన్ ప్రక్రియను ఇప్పుడు కేవలం నిమిషాల్లో పూర్తి చేయవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ఏఐ ఆధారిత ఇంటిగ్రేషన్ సిస్టమ్ ద్వారా వ్యాపారాలు పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం లేకుండానే ఫోన్‌పే పేమెంట్ గేట్‌వేను సులభంగా అనుసంధానం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ ప్రక్రియలో కోడింగ్, డాక్యుమెంట్ల పరిశీలన, పలు సాంకేతిక మార్పులు అవసరమయ్యేవి. అయితే ఇప్పుడు ఏఐ ఏజెంట్ల సహాయంతో ఇది సాధారణ సంభాషణ తరహాలోనే పూర్తి చేయగలమని కంపెనీ తెలిపింది.

ఈ ఏఐ కేవలం కోడ్ రాసే సాధనం మాత్రమే కాదని, చెల్లింపు వ్యవస్థల పనితీరును కూడా అర్థం చేసుకునే సామర్థ్యం కలిగి ఉందన్నారు. కంపెనీ రూపొందించిన ప్రత్యేక ఇంటిగ్రేషన్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కారణంగా మొత్తం ప్రక్రియ మరింత స్మార్ట్‌గా, వేగంగా మారిందని కంపెనీ అధికారులు వివరించారు. ఈ ఫీచర్ ముఖ్యంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఎంతో ఉపయోగపడనుంది. సాధారణంగా ఈ తరహా సంస్థల్లో పెద్ద డెవలపర్ బృందాలు ఉండవు. దీంతో పేమెంట్ సిస్టమ్‌ల అనుసంధానం వారికి క్లిష్టంగా మారుతుంది. ఇప్పుడు ఏఐ టూల్ సాయంతో ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా వేగంగా ఆన్‌లైన్ చెల్లింపులను ప్రారంభించవచ్చని కంపెనీ పేర్కొంది.

ఫోన్‌పే ప్రకారం, ఈ సిస్టమ్ సరైన ఏపీఐలు, చెల్లింపు సెటప్‌లను స్వయంచాలకంగా గుర్తించి అమలు చేస్తుంది. అలాగే లోపాలను సరిచేసి అవసరమైన సాంకేతిక మెరుగుదలలను కూడా చేస్తుంది. దీనివల్ల డెవలపర్‌ల సమయం గణనీయంగా ఆదా అవుతుందని, కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టవచ్చని తెలిపింది. భవిష్యత్తులో కూడా మరిన్ని ఏఐ ఆధారిత ఫీచర్లను తీసుకురావాలని ఫోన్‌పే యోచిస్తోంది. డిజిటల్ చెల్లింపులు, వ్యాపార కార్యకలాపాలను మరింత సులభతరం చేయడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని కంపెనీ విశ్వసిస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *