రోమన్ కాలి వేళ్ల వ్యక్తిత్వం: మీ కాలి మూడవ వేలు పొడవు రెండవ వేలు, బొటనవేలుతో సమానంగా ఉంటే, దాన్ని రోమన్ కాలి వేళ్లు అంటారు. ఇలాంటి చాలా క్రియాశీలంగా ఉంటారు, కాబట్టి వీరు ఈజీగా అందరికీ నచ్చుతారు. వీరు చూడ్డానికి ఇంట్రోవర్ట్గా కనిపించినా సామాజికంగా అందరితో కలిసిపోతారు. పక్కవారు చెప్పే మాటలను వీరు శ్రద్ధగా వింటారు. వీళ్లు ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. అదే మీ మూడవ వేలు ఇతర కాలి వేళ్ల కంటే చిన్నదిగా ఉంటే, ఇలాంటి వ్యక్తులు కష్టమైన పనుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. తమ పనిని వేరొకరు చేయాలని కోరుకుంటారు.