Headlines

Paradise: నో ట్రైలర్, నో పోస్ట్‌పోన్.. ఆన్ టైంకే పారడైస్ రిలీజ్


ఇన్నాళ్లూ మీడియా ముందుకు రాని ప్యారడైజ్ టీం సడన్‌గా ఎందుకొచ్చింది..? ఉన్నట్లుండి సడన్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినట్లు..? ఈ సినిమాకు ట్రైలర్ ఉండదా..? ఇంతకీ నాని సినిమా అనుకున్న టైమ్‌కే వస్తుందా లేదా చివరి నిమిషంలో మళ్లీ వాయిదా పడుతుందా..? అసలు ప్రెస్ మీట్‌లో నాని అండ్ టీం ఏం చెప్పారు..? ప్యారడైజ్ విషయంలో ఏం చెప్పబోతున్నారు..? ప్యారడైజ్ సినిమా రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇచ్చినా.. అనుమానాలు మాత్రం తగ్గట్లేదు. అందుకే నేరుగా దర్శక నిర్మాతలతో పాటు హీరో కూడా మీడియా ముందుకొచ్చారు. చాలా ముచ్చట్లు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సెప్టెంబర్ 24నే సినిమా అనుకున్న టైమ్‌కే వస్తుంది.. ఈసారి మామూలుగా ఉండదు సినిమా అంటున్నారు నాని. అంతేకాదు ట్రైలర్ లేకుండానే సినిమా వస్తుందని షాకిచ్చారు నాని. ప్యారడైజ్ టీజర్ చూసి సినిమా అంతా వయోలెన్స్ ఉందనుకుంటున్నారు.. కానీ ఇది ఎమోషనల్ జర్నీ.. అంతకుమించి అమ్మా కొడుకుల కథ అంటూ చెప్పుకొచ్చారు నాని. అంతేకాదు సినిమా అంతా హై మూవెంట్స్ మీరు చూడబోతున్నారంటూ ఊరించారు. మరోవైపు శ్రీకాంత్ ఓదెల కూడా సినిమా లైన్ ఏంటో ఒక్క ముక్కలో చెప్పేసారు. క్వాలిటీ కోసమే ఇంత టైమ్ పట్టిందని.. ఆ విషయంలో శ్రీకాంత్ ఓదెల అస్సలు కాంప్రమైజ్ కాలేదని చెప్పుకొచ్చారు నాని. మరోవైపు టికెట్ హైక్స్ గురించి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికైతే దాని గురించి ఆలోచించట్లేదని.. ఆ టైమ్ వచ్చినపుడు మాట్లాడదామన్నారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. ప్రీమియర్స్ ఉంటాయని కూడా తేల్చేసారు. మొత్తానికి ఒక్క ప్రెస్ మీట్‌తో చాలా ప్రశ్నలకు సమాధానాలిచ్చారు టీం.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సిబ్బందిపై కారం చల్లి బ్యాంకులో దోపిడీ..

కన్నబిడ్డల పట్ల కర్కశంగా మారుతున్న తల్లిదండ్రులు.. ఎందుకు?

Neena Gupta: 67ఏళ్ల వయసులో ప్రెగ్నెంటా..? ఇచ్చిపడేసిన ఒకప్పటి హీరోయిన్

Epic: ఎపిక్‌ సూపర్ కలెక్షన్స్‌.. డే1 ఎంతంటే?

Hanuman Ansh: త్రివిక్రమ్ తీసుకొస్తున్నారు సరే తెలుగు ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారు?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *