Pallavi Prashanth: 10 ఎకరాల మొక్కజొన్న పంట బూడిద పాలు.. నిర్మల్ జిల్లా రైతుల కోసం పల్లవి ప్రశాంత్ ఏం చేశాడో తెలుసా?

Pallavi Prashanth: 10 ఎకరాల మొక్కజొన్న పంట బూడిద పాలు.. నిర్మల్ జిల్లా రైతుల కోసం పల్లవి ప్రశాంత్ ఏం చేశాడో తెలుసా?


బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రైతు బిడ్డ ట్యాగ్ తో అందరికీ సుపరిచితమైన ఈ తెలంగాణ కుర్రాడు రైతులకు తన వంతు సహాయం చేస్తున్నాడు. తాజాగా మరోసారి గొప్ప మనసును చాటుకున్నాడు ప్రశాంత్. ఇటీవల నిర్మల్ జిల్లాలోని పెంబి మండలంలో గోసుకుల రాములు, కన్నె మల్లేష్ అనే ఇద్దరు రైతులు తమ కున్న 10 ఎకరాల పొలంలో మొక్కజొన్నను సాగు చేశారు. పంట కూడా చేతికి వచ్చింది. ఇక కోతలు మొదలు పెట్టేందుకు కూడా రెడీ అయ్యారు. అయితే ఈ సమయంలో విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ కారణంగా 10 ఎకరాల మొక్కజొన్న పంట మొత్తం కాలి బూడిదైపోయింది. నెలల పాటు సాగు చేసిన పంట చేతికొచ్చే ముందు బూడిద పాలు కావడంతో రైతులు విలవిల్లాడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దేశానికి అన్నం పెట్టే రైతులు ఏడుస్తున్నటువంటి వీడియోలు అందరినీ కలిచివేశాయి. దీంతో ప్రభుత్వం కూడా ఈ ఘటనపై స్పందించింది. పంటను కోల్పోయిన రైతులకు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా ఈ ఘటనపై స్పందించారు. రైతులకు అండగా నిలిచారు. తన మనుషులను అక్కడికి పంపించి వారికి తనవంతు ఆర్థిక సహాయం అందజేశారు.

ప్రస్తుతం తాను మాలలో ఉన్నానని, అందుకే అక్కడికి వెళ్లలేకపోయారని మాల తీసిన వెంటనే స్వయంగా వెళ్లి రైతులను కలుస్తాను అంటూ వీడియో కాల్స్ ద్వారా సదరు రైతులతో మాట్లాడి వారికి ధైర్యం కల్పించాడు పల్లవి ప్రశాంత్. ‘
నిర్మల్ జిల్లా, పెంబి మండలంలో విద్యుత్ తీగల షార్ట్ సర్క్యూట్ వల్ల కోతకు వచ్చిన 10 ఎకరాల మొక్కజొన్న పంట కాలిపోయింది. ఒక రైతు పంట కోసం ఎంత కష్టపడతాడో మాటల్లో చెప్పలేం. పగలు రాత్రి తేడా లేకుండా చెమటోడ్చి పండించిన పంట కళ్లముందే కాలిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. రైతు నవ్వితేనే దేశం నవ్వుతుంది… కానీ ఇలాంటి ఘటనలు రైతు గుండెను ముక్కలు చేస్తాయి. ఈ బాధ చూసి నా వంతుగా కొంత సహాయం చేశాను. మనకు సాధ్యమైనంత వరకు రైతులకు అండగా నిలుద్దాం’ అని తన అభిమానులకు పిలుపు నిచ్చాడు పల్లవి ప్రశాంత్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *