విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. అటు వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలన్నీ రద్దు!
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ విమాన రాకపోకలపై ప్రభావం పడింది. భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దుబాయ్, దోహా, రియాద్, టెల్ అవీవ్ సహా మధ్యప్రాచ్యంలోని పలు గమ్యస్థానాలకు వెళ్లే అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది. ప్రాంతీయ ఉద్రిక్తతలకు కారణంగా ఇజ్రాయిల్ చేపట్టిన ఆపరేషన్ రోరింగ్ లయన్‌కు ఇరాన్ ప్రతిస్పందన ఇవ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. కొన్ని…