వృద్ధుడి ఇంట్లో రూ.6.72 లక్షల బంగారం మాయం.. పోలీసుల దర్యాప్తులో దిమ్మతిరిగే నిజం!
స్మార్ట్‌ఫోన్ అంటే క్రేజ్ ఉండటం సహజమే. కానీ ఆ క్రేజ్ హద్దులు దాటితే పరిస్థితులు ఎంత దారుణంగా మారుతాయో మహారాష్ట్రలోని యవత్మల్‌లో వెలుగుచూసిన ఘటన చెబుతోంది. iPhone Pro కొనాలన్న కోరికతో ఓ మైనర్ బాలుడు ఏకంగా తన సొంత తాత ఇంట్లోనే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇంట్లోని ఇనుప అల్మరాను పగలగొట్టి సుమారు 52 గ్రాముల బంగారు ఆభరణాలు, మొత్తం రూ.6.72 లక్షల విలువైన నగలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన…