Pakistan Cricket: అవమానించి మెడపట్టి బయటకు పంపేశారు.. పాక్ బోర్డుపై మాజీ కోచ్ సంచలన ఆరోపణలు
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అంతర్గత వ్యవహారాలపై ఆస్ట్రేలియా దిగ్గజం, మాజీ టెస్టు కోచ్ జేసన్ గిలెస్పీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనకు ఇంకా వేలాది డాలర్లు బాకీ పడ్డారని, బోర్డులో ఆకిబ్ జావేద్ పెత్తనం వల్ల తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానంటూ సంచలన విషయాలు బయటపెట్టారు. పాకిస్థాన్ టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో క్రికెట్‌ను సరైన బాటలో పెట్టాలని జేసన్ గిలెస్పీ భావించారు. పీసీబీ ఛైర్మన్ మొహసిన్ నఖ్వీ ఆధ్వర్యంలో…