Headlines

OTT Movie: ఓటీటీలోకి వచ్చిన 24 గంటల్లోనే టాప్‌లో ట్రెండింగ్.. ఆడియెన్స్‌ను భయపెడుతోన్న తెలుగు హారర్ థ్రిల్లర్


ప్రస్తుతం ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేస్తున్నాయి. గత శుక్రవారం (సెప్టెంబర్ 25) స్ట్రీమింగ్ కు వచ్చిన సినిమాలు, సిరీస్ లు ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక, నయనతార హాయ్ తదితర సినిమాలు ఓటీటీ ఆడియెన్స్ కు మంచి వినోదం అందిస్తున్నాయి. అయితే వీటితో పాటే స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ హారర్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీ లో దుమ్ము రేపుతోంది. రికార్డు వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇదొక డివోషనల్ హారర్ థ్రిల్లర్. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మిస్టరీ,క్షుద్రపూజలు, రివేంజ్ వంటి ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ఆడియెన్స్ కు మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈ సినిమాకు 7.5 రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఆధ్యాత్మిక శక్తులున్న మహదేవి అనే మహిళ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఊరిలో వరుసగా జరిగే వింత మరణాలు, ఆమె చెల్లెలి అనుమానాస్పద ఆత్మహత్య, తదితర దారుణాల వెనక ఉన్న నిజనిజాలు తేల్చేందుకు మహదేవి సాగించే అన్వేషణ నేపథ్యంలో ఆద్యంతం థ్రిల్లింగ్ గా ఈ సినిమా సాగుతుంది. దైవ శక్తికి, దుష్ట శక్తికి మధ్య జరిగే పోరాటం, క్షుద్ర శక్తులు తదితర అంశాలు ఆడియెన్స్ కు తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తాయి.

ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోన్న ఈ సినిమా పేరు ‘అగధ’. పొలిమేర సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల (మహాదేవి) ఇందులో మెయిన్ లీడ్ రోల్ చేసింది. అలాగే శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, భానుచందర్, వనితా విజయకుమార్, జోవికా విజయకుమార్, షిజూ, రోషన్ బషీర్ తదితరులు వివిధ పాత్రల్లో కనిపించారు. గతంలో పలు సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఎంఎస్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. ప్రస్తుతం అగధ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడం తదితర భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా జీ 5 ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి



జీ5లో కామాక్షి భాస్కర్ల అగధ

అగధ సినిమా ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *