పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానిక గిరిజనులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో విరుచుకుపడుతున్న పులి, మూగజీవాలపై దాడులకు తెగబడుతోంది. బోలగోండ గ్రామంలో రెండు పశువులపై దాడి చేసిన పులి, నిన్న మర్రిపాలెం వద్ద ఏకంగా నాలుగు పశువులను పొట్టనబెట్టుకుంది. దీంతో పాడిపశువులను కోల్పోయిన రైతులు, గిరిజనులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రస్తుతం ఈ పెద్దపులి కదలికలను చినకోరుమిల్లి గిరిజన గ్రామంలోని తోటల్లో అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో బందపల్లి, తాళ్లపాలెం, భీమవరం, పెద్దకొండ గ్రామాల ప్రజలను అటవీ అధికారులు అప్రమత్తం చేశారు. గ్రామస్తులు ఎవరూ ఒంటరిగా అడవిలోకి, తోటల్లోకి వెళ్లవద్దని, రాత్రి వేళల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న జోరు వాన, మరోవైపు పొంచి ఉన్న పెద్దపులి భయంతో ఏజెన్సీ ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నామని, అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పులిని బంధించి తమకు రక్షణ కల్పించాలని గిరిజన ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నటుడి కారుణ్య మరణం! ఏడిపిస్తున్న చివరి పోస్ట్
The Paradise: నాని ‘ప్యారడైజ్’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!