Headlines

డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ SI ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!


తెలుగు రాష్ట్రాల యువత ఎక్కువగా పోటీ పడే ప్రభుత్వ ఉద్యోగాల్లో పోలీస్‌ కొలువులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎస్‌ఐ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) ఉద్యోగాలకు కూడా ప్రకటన విడుదలైంది. కేంద్ర సాయుధ పోలీసు దళాలు (సీఏపీఎఫ్‌), దిల్లీ పోలీస్‌ విభాగంలో ఎస్‌ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నియామకాల ద్వారా మొత్తం 1871 ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హతతో చాలా పోస్టులకు పోటీ పడవచ్చు. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం అవగా.. మరికొన్ని గంటల్లో గడువు ముగియనుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు సెప్టెంబర్ 30, 2026వ తేదీ ముగింపు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలు, వైద్య పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ SI ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏయే విభాగాల్లో ఉద్యోగాలు?

ఎంపికైన అభ్యర్థులు వివిధ కేంద్ర సాయుధ పోలీసు దళాలతో పాటు ఢిల్లీ పోలీస్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి



  • ఢిల్లీ పోలీస్‌ పోస్టుల సంఖ్య: 317
  • సీఆర్‌పీఎఫ్‌ పోస్టుల సంఖ్య: 254
  • బీఎస్‌ఎఫ్‌ పోస్టుల సంఖ్య: 457
  • ఐటీబీపీ పోస్టుల సంఖ్య: 187
  • సీఐఎస్‌ఎఫ్‌ పోస్టుల సంఖ్య: 250
  • ఎస్‌ఎస్‌బీ పోస్టుల సంఖ్య: 172
  • సీఐఎస్‌ఎఫ్‌ (ఫైర్‌) పోస్టుల సంఖ్య: 234

చాలా ఎస్‌ఐ పోస్టులకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ అర్హతగా ఉంది. అయితే కొన్ని ప్రత్యేక పోస్టులకు అదనపు విద్యార్హతలు, నిబంధనలు ఉన్నాయి. ఢిల్లీ పోలీస్‌ పురుషుల విభాగంలోని పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి లైట్‌ మోటార్‌ వెహికల్‌ (LMV) డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి. సీఐఎస్‌ఎఫ్‌ ఫైర్‌ పోస్టులకు మాత్రం బీఎస్సీ (ఎంపీసీ) లేదా నిర్దేశిత విభాగాల్లో డిప్లొమా/బీటెక్‌ అర్హత అవసరం. 2026 ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 2001 ఆగస్టు 2 నుంచి 2006 ఆగస్టు 1 మధ్య జన్మించిన వారు సాధారణ కేటగిరీలో అర్హులు. రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠ వయసులో 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. అయితే సీఐఎస్‌ఎఫ్‌ ఫైర్‌ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో ఈ సెప్టెంబరు 30, 2026వ తేదీ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.100 చొప్పున తప్పనిసరిగా చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. పరీక్ష తేదీలను ఎస్‌ఎస్‌సీ తర్వాత ప్రకటించనుంది.

ఎస్‌ఐ పోస్టులకు ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను తదుపరి దశకు ఎంపిక చేస్తారు. రెండో దశ అర్హత సాధించిన వారికి పీఎస్‌టీ (Physical Standard Test), పీఈటీ (Physical Endurance Test) నిర్వహిస్తారు. మూడో దశ దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించినవారికి పేపర్‌ 2 పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. నాలుగో దశ పేపర్‌ 2లో సాధించిన మార్కులు, మెరిట్‌, రిజర్వేషన్‌ తదితర నిబంధనల ఆధారంగా అభ్యర్థులను వైద్య పరీక్షలకు ఎంపిక చేస్తారు. వైద్య పరీక్షల్లో అర్హత సాధించినవారిని సంబంధిత విభాగాల్లో శిక్షణకు పంపిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి 7వ వేతన సంఘం ప్రకారం లెవెల్‌ 6 పే స్కేల్‌ వర్తిస్తుంది. మూల వేతనం రూ.35,400 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం లభించే అలవెన్సులు అదనంగా ఉంటాయి. అలవెన్సులను కలుపుకుంటే పోస్టింగ్‌, నగరం, వర్తించే ప్రభుత్వ నిబంధనలను బట్టి ప్రారంభ నెలల్లోనే మొత్తం వేతనం రూ.70,000కు పైగా ఉండే అవకాశం ఉంటుంది.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ SI ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎస్‌ఐగా విధుల్లో చేరిన తర్వాత అనుభవం, శాఖాపరమైన నిబంధనలు, పదోన్నతి ప్రమాణాల ఆధారంగా ఉన్నత హోదాలకు ఎదిగే అవకాశాలున్నాయి. సుమారు 10-15 ఏళ్ల సేవ తర్వాత ఇన్‌స్పెక్టర్‌ స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. అనంతరం సంబంధిత విభాగాల నిబంధనలకు అనుగుణంగా అసిస్టెంట్‌ కమాండెంట్‌, డిప్యూటీ కమాండెంట్‌, కమాండెంట్‌, సీనియర్‌ కమాండెంట్‌ వంటి ఉన్నత హోదాలకు చేరుకోవచ్చు. ఉద్యోగార్థులు అర్హతలు, వయోపరిమితి, పోస్టుల వివరాలు, పరీక్ష విధానం తదితరాలను అధికారిక నోటిఫికేషన్‌లో తప్పనిసరిగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ SI ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *