Nayanthara: అలా డ్యాన్స్ చేయడం.. NTRకే సాధ్యం

Nayanthara: అలా డ్యాన్స్ చేయడం.. NTRకే సాధ్యం


ప్రముఖ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న ఆమె.. ఇప్పటికీ ఏమాత్రం తగ్గని క్రేజ్ తో.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో నయన్ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ సామర్థ్యం, సెట్‌లోని అనుభవాలు, అలాగే తన అదుర్స్ చిత్రంలో చంద్రకళ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ డ్యాన్స్ ప్రతిభకు తాను ఎంతగానో ఆశ్చర్యపోయానని నయన్ చెప్పుకొచ్చారు. రిహార్సల్స్ లేకుండానే జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారన్నారు. ఆయన డ్యాన్స్‌ను తెరపై చూసి తాను ఆశ్చర్యపోయానంటూ చెప్పుకొచ్చారు నయన్. అలా ఎన్టీఆర్‌ ఒక్కరు మాత్రమే చేస్తారని.. తాను చూసిన ఏకైక హీరో కూడా తనే అని.. నయన్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎన్టీఆర్ సెట్‌లో చాలా సరదాగా ఉంటారని, అదుర్స్‌ టైంలో తారక్‌ తో ఓ సంఘటనను నయన్ గుర్తు చేసుకున్నారు. ఒకరోజు తాను టచ్-అప్ చేసుకుంటుంటే.. ఎన్టీఆర్ తనను నిశితంగా చూసి… ఎవరూ నిన్ను చూడరు..అందరూ నన్నే చూస్తారు.. ఎందుకంత టచప్ అని ఫన్నీగా చెప్పారంటూ గుర్తు చేసుకున్నారు నయన్. ఎన్టీఆర్ ఎలాంటి కదలికలైనా అలవోకగా చేస్తారని, డ్యాన్సర్‌లు చేసిన దానికంటే చాలా అద్భుతంగా చేస్తారని ఆమె ప్రశంసించారు. అలాంటి తారక్‌ చేత.. రాజమౌళి నాటు నాటు పాట కోసం.. హుక్ స్టెప్‌ను చాలా సార్లు చేయించారంటూ.. చివర్లో నవ్వుతూ కోట్ చేశారు నయన్. నయనతార తన కెరీర్‌లో చేసిన అదుర్స్ సినిమాలో చంద్రకళ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఈ పాత్రకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్, మీమ్స్ ఉన్నాయని ఆమె తెలిపారు. సినిమాలో బ్రహ్మానందం పాత్రతో చంద్రకళకు సంబంధించిన మీమ్స్‌ను ఆమె చూసి ఆశ్చర్యపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Millionaire Tips: ఈ 8 ఖర్చులు ఆపేస్తే కోటీశ్వరులు అవ్వడం ఖాయం

Biker OTT: అప్పుడే OTTలోకి బైకర్ మూవీ..

మందు బాబులకు అలర్ట్! వేసవిలో.. డ్రింక్ చేస్తే గుండె లయ తప్పుతుందా ??

మూడు పూటలా అన్నమే.. అయినా కండలు తిరిగిన దేహం..

రసగుల్లా తింటే పక్షవాతం ఖాయమా? డాక్టర్లు ఏం చెప్పారు?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *