Headlines

Nayanthara : అతడు ఒక చిన్న పిల్లాడు.. ఇప్పుడు టాలీవుడ్‏లో పెద్ద హీరో అయ్యాడు.. నయనతార కామెంట్స్..

Nayanthara : అతడు ఒక చిన్న పిల్లాడు.. ఇప్పుడు టాలీవుడ్‏లో పెద్ద హీరో అయ్యాడు.. నయనతార కామెంట్స్..


సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది హీరోయిన్ నయనతార. తక్కువ సమయంలోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆమె.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ గా సుపరిచితమే.తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు 75కు పైగా చిత్రాల్లో నటించారు. 2023లో షారుఖ్ ఖాన్ సరసన ‘జవాన్’ సినిమాతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా మారింది. ఇప్పుడు ఆమె ఒక్కో సినిమాకు సుమారు రూ.10-15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. స్టార్ హీరోలతో కలిసి నటించిన ఆమె.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రవితేజ, ప్రభాస్‌లతో తనకున్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వారిద్దరితో తన స్నేహం, పని అనుభవాలు, వ్యక్తిత్వ లక్షణాలను వివరిస్తూ, పరిశ్రమలో సహోద్యోగులతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

రవితేజతో తన స్నేహం గురించి మాట్లాడుతూ, ఒకప్పుడు రవితేజ తనకు చాలా మంచి స్నేహితుడని, బెస్ట్ ఫ్రెండ్స్‌లో ఒకరని పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యక్తిగత పనుల వల్ల తరచుగా కలవలేకపోతున్నా, వారిద్దరి మధ్య స్నేహబంధం ఇప్పటికీ అలాగే ఉందని తెలిపారు. రవితేజ తన వృత్తిపరమైన బాధ్యతలతో బిజీగా ఉండగా, తాము కూడా తమ పనుల్లో నిమగ్నమై ఉండటంతో వారు కలుసుకోవడం తగ్గిందని వివరించారు. ఈ దూరం వారి స్నేహాన్ని తగ్గించలేదని, కేవలం టచ్‌లో లేకపోవడం మాత్రమే అని స్పష్టం చేశారు. రవితేజ, తాము హిందీలో మాట్లాడుకునే విచిత్రమైన అలవాటును కూడా గుర్తుచేసుకున్నారు. రవితేజ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పెద్ద అభిమాని కావడం వల్లే ఇది జరిగిందని, ఆయన హిందీ డైలాగులు అద్భుతంగా చెబుతారని, చాలా బాగా మాట్లాడుతారని ప్రశంసించారు. కలిసి పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ హిందీ సంభాషణ అలవాటు కొనసాగిందని, అది ఇప్పటికీ అలాగే ఉందని తెలిపారు. రవితేజతో చాలా సినిమాలలో కలిసి పనిచేసిన అనుభవం ఉందని కూడా పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

అదేవిధంగా, ప్రభాస్‌తో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, ప్రభాస్ చాలా స్వీట్ అని, ఆయన వ్యక్తిత్వం ఒక పిల్లాడిలా ఉంటుందని అన్నారు. ఆయనతో కలిసి పనిచేసిన రోజుల్లో, ప్రభాస్ పూర్తి అల్లరి పిల్లాడిలా సెట్‌లో అటూ ఇటూ గెంతుతూ, జోకులు వేస్తూ సరదాగా గడిపేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ, చలాకీగా ఉంటూ సెట్‌లో సరదా వాతావరణాన్ని సృష్టించేవారని వివరించారు. ఇప్పుడు ప్రభాస్ పాన్-ఇండియా స్టార్‌గా ఎదగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆయన అంత పెద్ద స్టార్‌గా మారడం తనకు చాలా ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

Nayanthara, Prabhas

Nayanthara, Prabhas

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *