LSG Vs KKR: వాడ్ని నమ్మి నిండా మోసపోయాం.! రూ. 23 కోట్లు బొక్క.. ఆ ప్లేయర్‌పై రిషబ్ పంత్ ఫైర్

LSG Vs KKR: వాడ్ని నమ్మి నిండా మోసపోయాం.! రూ. 23 కోట్లు బొక్క.. ఆ ప్లేయర్‌పై రిషబ్ పంత్ ఫైర్


LSG Vs KKR: వాడ్ని నమ్మి నిండా మోసపోయాం.! రూ. 23 కోట్లు బొక్క.. ఆ ప్లేయర్‌పై రిషబ్ పంత్ ఫైర్

ఐపీఎల్ అంటేనే ఆఖరి బంతి వరకు ఉత్కంఠ. అలాంటిది మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్తే ఆ కిక్కే వేరు. 2026 ఐపీఎల్ సీజన్‌లో మొదటి సూపర్ ఓవర్ పోరు మనకు కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగింది. ఒకానొక దశలో లక్నో గెలుస్తుందని అనిపించినా, చివరకు కేకేఆర్ తన అద్భుత ప్రదర్శనతో విజయాన్ని అందుకుంది. ఈ ఓటమి లక్నో జట్టును పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడేసింది.

ఇది చదవండి: ఇది చిటికెడు వేస్తే చాలు.. మందార మొక్కకు వచ్చే తెల్లని పురుగులను తరిమి కొట్టొచ్చు..

మ్యాచ్ విషయానికి వస్తే, కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేసి 155 పరుగులు చేసింది. రింకూ సింగ్(83 పరుగులు) మరోసారి తన బ్యాట్‌తో జట్టును ఆదుకున్నాడు. లక్ష్య చేధనలో లక్నో చివరి ఓవర్లో అద్భుతం చేసింది. చివరి బంతికి 7 పరుగులు అవసరమైన వేళ షమీ సిక్స్ బాదడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారితీసింది. అయితే, సూపర్ ఓవర్లో సునీల్ నరైన్ తన స్పిన్ మాయాజాలంతో లక్నోను కేవలం ఒకే పరుగుకు కట్టడి చేశాడు. రెండు పరుగుల లక్ష్యాన్ని రింకూ సింగ్ ఫోర్ కొట్టి సులభంగా ముగించేశాడు.

ఈ ఓటమి తర్వాత లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు. “వరుస ఓటములు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టాయి. టీ20 క్రికెట్‌లో ఒత్తిడి సహజమే కానీ, దానికి సమాధానం మనలోనే వెతుక్కోవాలి” అని పంత్ పేర్కొన్నారు. నికోలస్ పూరన్‌ను సూపర్ ఓవర్లో పంపడంపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ, టీమ్ మేనేజ్మెంట్ అతన్ని నమ్మిందని, కానీ ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం 12 పరుగులు చేసి ఉంటే డిఫెండ్ చేసుకునే అవకాశం ఉండేదని, కానీ కేవలం ఒక పరుగు చేయడం మ్యాచ్‌ను చేజార్చుకున్నట్లు అయిందని పంత్ అన్నాడు. నెక్స్ట్ మ్యాచ్ ముందుగా వచ్చే విరామంతో తాము మళ్లీ బలంగా పుంజుకుంటామని.. కచ్చితంగా కంబ్యాక్ ఇస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

ఇది చదవండి: వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఇక చిటికలో పని.. లోపలికి దిగకుండానే ఈజీగా శుభ్రం చేయండిలా.!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *