ఎందరో సినీ గేయ రచయితలు తెలుగు సాహిత్యాన్ని అద్భుతంగా వాడి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను రచించారు. వేల పాటలు ప్రేక్షకుల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి. ప్రతి సినిమాలో పాటలు అనేవి కీలక పాత్ర పోషిస్తుంటాయి. సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయిన సాంగ్స్ హిట్ అయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గేయరచయితలు ఎంతో మంది మన తెలుగులో ఉన్నారు. వారిలో చంద్రబోస్ ఒకరు. గేయ రచయిత చంద్రబోస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. 1995లో వచ్చిన తాజ్ మహల్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. ఆయన కలం నుంచి ఎన్నో అద్భుతమైన పాటలు పురుడుపోసుకున్నాయి.
ఇది కూడా చదవండి :ఎంత బాగుంది మావ ఈ సాంగ్..! లవర్స్ తెగ పాడుకున్న పాట.. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాల్సిందే
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును తెలుగు సినిమా లోగిలికి తీసుకు వచ్చారు చంద్రబోస్, ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఆయన రచించిన నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో చంద్రబోస్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో ఆయన తన సినిమా అనుభవాలను, ప్రేక్షకుల పై తన పాటల ప్రభావం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఇది కూడా చదవండి :Nagarjuna: ఇండస్ట్రీలో నాగార్జున అన్నయ్య అని పిలిచే ఏకైక నటుడు ఎవరో తెలుసా.?
అదేవిధంగా గేయ రచయితలకు రెమ్యునరేషన్ బాగానే ఉంటుందని తెలిపారు.. బాగా రాసి,ఎక్కువ వ్యూస్ , పాపులారిటీ తెచ్చుకుంటే ఐపీఆర్‌ఎస్ (ఇండియన్ ఫెర్మారింగ్ రైట్స్ సొసైటీ) ద్వారా రాయల్టీ కూడా వస్తుందని తెలిపారు చంద్రబోస్. ఉదాహరణకు ఒక పాటకు రాయల్టీ రూపంలో రూపాయి వస్తే, అందులో రచయిత, సంగీత దర్శకుడికి చెరో పావలా, పబ్లిషింగ్ కంపెనీకి 50పైసలు ఇస్తారు అని వివరించారు చంద్రబోస్. ఇక ఎక్కువమందిని ఆకట్టుకున్న సాంగ్స్ లో ‘చిరు చిరు చినుకై కురిశావే’ ఒకటని.. ఆ పాట రాసినప్పుడు తనకు రూ.25వేలు ఇచ్చారు. ఇప్పటికి ఆ పాట రాయల్టీ రూపంలో రూ.10లక్షలకు పైగా సంపాదించింది. ఇంకా వస్తూనే ఉంటుంది. రూ.50వేల నుంచి రూ.లక్ష వచ్చిన సందర్భమూ ఉంది.తెలిపారు చంద్రబోస్.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : స్టార్ హీరోని పెట్టి సినిమా చేశా.. కానీ పక్కా ఫ్లాప్ అవుతుందని అప్పడే తెలిసిపోయింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.