Headlines

Kusumanchi: కొట్టామంటే సక్సెస్ ఇలా ఉండాలి.. తండా యువకుడికి రూ.1.50కోట్ల ప్యాకేజీ!


చదువుతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగిన ఖమ్మం జిల్లా యువకుడు హలావత్ సుభాష్ చంద్రసాయి అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఫ్యూజీఫిల్మ్ ఇంజనీర్ కంపెనీలో ఏడాదికి రూ.1.50 కోట్ల వేతనంతో సీనియర్ ఇంజనీర్‌గా ఎంపికయ్యారు. డిసెంబర్ 14 నుంచి కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.

కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన సుభాష్ చంద్రసాయి విద్యాభ్యాసం ఖమ్మంలోనే ప్రారంభమైంది. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి మాస్టర్స్‌తో పాటు అదే విభాగంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పరిశోధన రంగంలో తన ప్రతిభను నిరూపించుకున్న సుభాష్.. ఓ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసిన 19 మంది బృందంలో అత్యుత్తమ అవకాశాన్ని అందుకున్నారు. ఆ బృందం నుంచి ప్రతిష్ఠాత్మక ఉద్యోగానికి ఎంపికైన ఏకైక వ్యక్తిగా నిలిచారు.

సుభాష్ తండ్రి సత్యం ప్రైవేటు ఉద్యోగి కాగా, తల్లి ధనలక్ష్మి ఆర్లగూడెం గిరిజన సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తన ప్రయాణంలో తల్లిదండ్రులతో పాటు తాతయ్య భద్రయ్య అందించిన ప్రోత్సాహం, మార్గనిర్దేశం ఎంతో కీలకమని సుభాష్ పేర్కొన్నారు. మారుమూల తండా నుంచి బయలుదేరి అమెరికాలో భారీ వేతనంతో ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యులు, స్వగ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *