Headlines

ఆ హీరోయిన్ పొగరుగా డాన్స్ చేయనని చెప్పేసింది.. దెబ్బకు ఆమెను సినిమా నుంచే తీసేశారు


దివంగత ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శివ శంకర్ ఎన్నో సినిమాల్లో తన కొరియాగ్రాఫ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో నటి సిల్క్ స్మితాతో తనకున్న వృత్తిపరమైన అనుభవాలను, జ్ఞాపకాలను వెల్లడించారు. ఒక సినిమా పాట చిత్రీకరణ సమయంలో సిల్క్ స్మితా డాన్స్ చేయడానికి నిరాకరించిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను అసిస్టెంట్‌గా ఉన్న సమయంలో, ఒక మలయాళం సినిమా కోసం స్మితా హీరోయిన్‌గా ఉన్నప్పుడు ఆమెతో ఒక పాటను కొరియోగ్రాఫ్ చేయాల్సి వచ్చిందని శివ శంకర్ మాస్టర్ తెలిపారు. అప్పటికి స్మితా పెద్ద స్టార్‌గా ఎదిగిందని, తాను అసిస్టెంట్‌గా ఉన్న శివ శంకర్‌తో డాన్స్ చేయడానికి నిరాకరించిందని ఆయన వివరించారు. “నేను చేయను, డాన్స్ మాస్టర్‌ని మారిస్తే చేస్తాను” అని స్మితా స్పష్టంగా చెప్పినట్లు శివ శంకర్ మాస్టర్ పేర్కొన్నారు. ఈ విషయం ఆ సినిమా ప్రొడ్యూసర్ అర్జున్ రాజు గారికి చేరింది. ఆయన కొండ మీద ఉన్నానని, తిరిగి వచ్చాక మాట్లాడుతానని చెప్పి, ఆ తర్వాత స్మితాతో మాట్లాడారు. “ఆ మాస్టర్ గారు చాలా బాగా చేస్తారు, ఆయన వల్ల ఏ ప్రాబ్లం లేదు. ఇంకోసారి అడగండి, చేయకపోతే వేరే వాళ్ళని ఫిక్స్ చేయండి. కానీ మాస్టర్ గారిని మాత్రం వదలొద్దు” అని అర్జున్ రాజు చెప్పినట్లు శివ శంకర్ మాస్టర్ వివరించారు.

అయితే స్మితా తన నిర్ణయాన్ని మార్చుకోలేదని, అడ్వాన్స్ కింద తీసుకున్న చెక్‌ను తిరిగి ఇచ్చిందని శివ శంకర్ మాస్టర్ తెలిపారు. ఆ తర్వాత నుంచే స్మితా జీవితంలో స్టెప్ బై స్టెప్ పతనం మొదలైందని ఆయన అభిప్రాయపడ్డారు. చివరికి ఆ పాటను జయమాలినితో చిత్రీకరించారని, ఆ సినిమా పెద్ద హిట్ అయ్యిందని శివ శంకర్ మాస్టర్ గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన తర్వాత, తాము పది మంది మాస్టర్లు స్మితాతో డాన్స్ చేయమని నిర్ణయించుకున్నామని కూడా ఆయన వెల్లడించారు.

అయితే, శివ శంకర్ మాస్టర్ స్మితా వ్యక్తిత్వాన్ని, ఆమె వృత్తి పట్ల నిబద్ధతను, అద్భుతమైన కళాత్మక దృష్టిని ప్రశంసించారు. ఆమెకు అసాధారణమైన మేకప్ సెన్స్, డ్రెస్ సెన్స్ ఉన్నాయని కొనియాడారు. “ఒక 5,000 రూపాయల చీరను తీసుకువచ్చి ఇస్తే, దాన్ని కట్ చేసి, దానికి ఏదైనా యాడ్ చేసి 25,000 రూపాయల చీర లాగా మార్చేసేది” అని ఆయన ఉదహరించారు. శ్రీదేవికి ఎంత మంచి మేకప్ సెన్స్ ఉందో, స్మితాకు కూడా అంతే ఉందని ఆయన పోల్చారు. రేఖకు కూడా అద్భుతమైన కాస్ట్యూమ్, డిజైన్ సెన్స్ ఉందని గుర్తు చేసుకున్నారు. తనకు స్మితాతో ఎటువంటి కాంట్రవర్సీ లేదని శివ శంకర్ మాస్టర్ స్పష్టం చేశారు. “ఆమె నా కూతురు లాంటిది” అని పేర్కొన్నారు. స్మితా మరణం తర్వాత తాను అంత్యక్రియలకు కూడా వెళ్ళానని, ఆమె రోజు పడుకున్నట్లే ఫ్రెష్‌గా పడుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Silk Smitha

Silk Smitha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *