Headlines

Kasturi Shankar : హీరోల్లో ఇప్పటికీ ఆయనే నా క్రష్ .. ఆయనను చూడగానే ఫిదా అయిపోయా.. కస్తూరి శంకర్..

Kasturi Shankar : హీరోల్లో ఇప్పటికీ ఆయనే నా క్రష్ .. ఆయనను చూడగానే ఫిదా అయిపోయా..  కస్తూరి శంకర్..


తెలుగు ప్రేక్షకులకు నటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కథానాయికగా, సహాయ నటిగా సినిమాలు, సీరియల్స్ ద్వారా తనదైన ముద్ర వేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కింగ్ నాగార్జున పట్ల తనకున్న బాల్యపు అభిమానాన్ని, ఆయనతో కలిసి పనిచేసిన అపురూప జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆమె చిన్నతనంలో యాంకర్‌గా పనిచేస్తున్న సమయంలో, ఒక స్టూడియోలో తన వర్క్ యాడ్ ఇస్తూ, ఎడిటింగ్‌లో ఉండగా నాగార్జున అన్నపూర్ణ ప్రొడక్షన్స్ తరపున ఏదో ఒక సినిమా పని మీద అక్కడికి వచ్చారని తెలిపారు. అప్పట్లో ఆమెకు నాగార్జున నటించిన సినిమా ఏదని తెలియదని, తాను చాలా చిన్నదని గుర్తుచేసుకున్నారు. అయితే, అప్పటికే గీతాంజలి సినిమాతో నాగార్జునకి అద్భుతమైన క్రేజ్ ఉండేదని, ఆయనను చూడగానే నాగార్జున… నాగార్జున అంటూ అందరూ సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారని ఆమె వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

నాగార్జుని మొదటిసారి చూసినప్పుడు ఆయన వేసుకున్న డ్రెస్, తాను వేసుకున్న డ్రెస్ కూడా తనకు స్పష్టంగా గుర్తుందని ఆమె పేర్కొన్నారు. ఇది సినిమాకు ముందు జరిగిన సంఘటన అని, ఆయనను చూసినప్పుడు చేయి ఇచ్చి, ఆ చేతిని కడుక్కోకుండానే పాఠశాలకు వెళ్లి అందరికీ చూపించి, అది నాగార్జునని చూసిన చెయ్యి అని గర్వంగా చెప్పానని ఆమె తెలిపారు. ఆ అనుభూతి తనకెంతో గొప్పదని, ఆయనతో జోడిగా పనిచేయడం ఒక కల నెరవేరినట్లే అని ఆమె సంతోషంగా చెప్పారు.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

సెట్‌లో నాగార్జునకి ఈ విషయం చెప్పారా అని అడిగినప్పుడు, తాను ధైర్యంగా చెప్పానని, ఆయన ఇప్పటికీ తన పట్ల చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని ఆమె స్పష్టం చేశారు. తనకు అన్ని హీరోలు ఇష్టమే అయినా, నాగార్జున మాత్రం సినిమా రంగానికి రాకముందే ఇష్టమని ఆమె తెలిపారు. ఆయనకు చెప్పడమే కాకుండా, హచ్ అడ్వర్టైజ్‌మెంట్‌లో వచ్చే చిన్న కుక్కపిల్లలాగా ఆయన వెనకే తిరిగేదాన్నని ఆమె సరదాగా చెప్పారు. బిగ్ బాస్ షో ద్వారా నాగార్జునలోని మేధస్సు, వ్యక్తిత్వం అందరికీ తెలిశాయని, ఆయన చాలా స్మార్ట్ అని, చాలా విషయాలు చదువుతారని ఆమె అన్నారు. సెట్‌లో ప్రతిరోజూ ఇద్దరూ కలిసి వార్తాపత్రికలు చదివేవారని, ఆయన హెడ్‌లైన్స్ చదివితే, తాను లోపలి పేజీలు చదివేదాన్నని, ఆ తర్వాత పేపర్‌ను మార్చుకునేవారమని ఆమె వివరించారు. నాగార్జున క్రీడలను, ముఖ్యంగా క్రికెట్‌ను ఎంతగానో ఇష్టపడతారని, కడపలో షూటింగ్ చేస్తున్నప్పుడు దక్షిణాఫ్రికాలో ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరిగేవని, ఉదయం నాలుగు గంటలకు మ్యాచ్ మొదలవుతుంటే, తాను వచ్చి చూసేసరికి ఆయన అప్పటికే ఎదురుచూస్తూ కూర్చొని ఉండేవారని ఆమె తెలిపారు. సినిమా రంగానికి అతీతంగా నాగార్జున ఒక ఆల్‌రౌండ్ కంప్లీట్ మ్యాన్ అని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

Kasturi Shankar, Nagarjuna

Kasturi Shankar, Nagarjuna

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *