కార్తీక దీపం.. బుల్లితెరపై దాదాపు ఏడేళ్లు సంచలనం సృష్టించిన సీరియల్. డాక్టర్ బాబు, వంటలక్క, దీప, శౌర్య, హిమ.. ఇప్పటికీ ఈ పాత్రల పేర్లు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాయి. అంతగా తమ నటనతో మెప్పించారు. తెలుగు బుల్లితెర చరిత్రలో ‘కార్తీకదీపం’ సీరియల్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సీరియల్‌లో నటించిన ప్రతి పాత్ర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ముఖ్యంగా వంటలక్క, డాక్టర్ బాబుల గారాబాల కూతురు ‘శౌర్య’ (రౌడీ) పాత్రలో నటించిన బేబీ కృతిక తన అమాయకమైన నటనతో, చురుకైన మాటలతో తెలుగు ఇంటి ఆడపడుచుగా మారిపోయింది. ఈ సీరియల్ తర్వాత పలు సినిమాల్లో నటించిన శౌర్య.. చాలాకాలంగా సినిమాలు, సీరియల్లకు దూరంగా ఉంటుంది. తాజాగా ఈ చిన్నది చదువులోనూ తన మార్కు చూపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy: మీ కోసమే అంటూ ప్రేమగా 8 నెలలు స్లో పాయిజన్ ఇచ్చింది.. డాక్టర్ మాటలు విని షాకయ్యా.. జేడీ చక్రవర్తి
ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో కృతిక అద్భుతమైన మార్కులు సాధించింది. సాధారణంగా చైల్డ్ ఆర్టిస్టులు షూటింగ్‌ల బిజీలో ఉండి చదువును నిర్లక్ష్యం చేస్తారనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ, కృతిక ఆ అభిప్రాయాన్ని తలకిందులు చేసింది. షూటింగ్‌లు, కెమెరా వెలుగుల మధ్య ఉన్నా కూడా చదువుపై ఏమాత్రం శ్రద్ధ తగ్గించకుండా కష్టపడి చదివి టాప్ మార్కులు స్కోర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కృతికకు సంబంధించిన ఇంటర్ మార్క్స్ మెమో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించినట్లు ఆ మెమో ద్వారా తెలుస్తోంది. ఇది చూసిన నెటిజన్లు, సీరియల్ అభిమానులు కృతికపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “రీల్ లైఫ్‌లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ నువ్వు టాపర్‌వే” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి క్రేజ్.. కానీ.. ఆ ఒక్క అలవాటుతో బలైన టాలీవుడ్ అందగాడు..
కృతిక బాల నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి, ‘కార్తీకదీపం’ తర్వాత కూడా పలు సినిమాలు, షోలలో కనిపిస్తూ బిజీగా ఉంటోంది. అయినప్పటికీ, సమయాన్ని కేటాయించుకుని చదువులో రాణించడం విశేషం. నటిగా ఎంతో భవిష్యత్తు ఉన్న కృతిక, విద్యా రంగంలో కూడా ఇలాగే ముందుకు సాగాలని ఆమె శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Monalisa Bhosle: మోనాలిసా మిస్సింగ్.. సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ఫర్మాన్ ఖాన్..
ఎక్కువ మంది చదివినవి : Prasad Behara : విరాజితతో సిరీస్ ఆపేయడానికి కారణం ఇదే.. అసలు విషయం చెప్పిన ప్రసాద్ బెహరా..