గాయపడ్డ సింహం సినిమాతో తొందర్లో తెలుగు ఫిల్మ్ లవర్స్‌ను పలకరించేందుకు రెడీ అవుతున్న జేడీ చక్రవర్తి… ఆ సినిమా ప్రమోషన్స్‌ను షురూ చేశారు. పలు ఇంటర్వ్యూలిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని షాకింగ్ విషయాలను పంచుకున్నాడు. తనకు ప్రేమగా స్లోపాయిజన్ ఇస్తూ.. చంపాలని చూశారంటూ చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశాడు. తాను చావు అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చానంటూ జేడీ చక్రవర్తి షాకింగ్ ఇన్‌సిడెంట్‌ను పంచుకున్నాడు.తనకు గత ఎనిమిది నెలల నుంచి ఒక సంవత్సరం వరకు తనపై ‘నెమ్మదిగా విషప్రయోగం’ చేశారన్నాడు జేడీ చక్రవర్తి. విషప్రయోగం కారణంగా ఆయన తీవ్రమైన శ్వాస సమస్యలతో బాధపడ్డారు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టపడేవారని, అనేక మంది వైద్యులను సంప్రదించినా ఎవరూ తమ సమస్యను గుర్తించలేకపోయారని తెలిపారు. ఇండియా.. శ్రీలంకలోని పలు ఆసుపత్రులలో చికిత్స తీసుకున్నా ప్రయోజనం లేకపోయిందని.. చివరికి, తన స్నేహితుడు చల్లా శేషు రెడ్డి సలహా మేరకు హైద్రాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో.. ప్రత్యేక పరీక్షల ద్వారా అసలు విషయం తెలుసుకున్నా అంటూ చెప్పుకొచ్చాడు. తనపై ప్రయోగించిన విషం పోస్ట్‌మార్టం చేసినా గుర్తించలేనంత సూక్ష్మంగా ఉంటుందని, తాను తీసుకుంటున్న ఒక ఔషధం ద్వారా ఇది తన శరీరంలోకి చేరిందని జేడీ వెల్లడించారు. ఒకరోజు ఊపిరి అందక చనిపోతానని నిశ్చయించుకున్న సమయంలో, ఉదయం 4:30 గంటలకు తన తల్లి ఆస్తమా కోసం ఉపయోగించే ఇన్‌హేలర్‌ను అందించగా, అది తన ప్రాణాలు నిలబెట్టిందని ఆయన గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో ఎటువంటి చెడు అలవాట్లు లేకపోవడం వల్లే తన శరీరం ఆ విషాన్ని అంత త్వరగా స్వీకరించలేదని చెప్పుకొచ్చాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘హోటల్లో పని చేస్తున్నప్పుడు చూసి చిరు అవకాశం ఇచ్చారు.. కానీ
Sridevi: జురాసిక్ పార్క్ సినిమా హీరోయిన్ ఛాన్స్ !! లైట్ తీసుకుని నో చెప్పిన శ్రీదేవి
బెంగళూరులో రూ.500తో రోజు గడవడం సాధ్యమేనా ??
ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు ఎంత పెరుగుతాయంటే..!
Telangana Orange Alert: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ