‘హోటల్లో పని చేస్తున్నప్పుడు చూసి చిరు అవకాశం ఇచ్చారు.. కానీ

‘హోటల్లో పని చేస్తున్నప్పుడు చూసి చిరు అవకాశం ఇచ్చారు.. కానీ


సీనియర్ నటుడు నాజర్, మెగాస్టార్ చిరంజీవితో తనకు ఉన్న ప్రత్యేకమైన స్నేహబంధాన్ని ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తమ అనుబంధం.. ఆత్మాభిమానం, పరస్పర గౌరవం వంటి పునాదుల మీద నిర్మించబడిందని, ఎలాంటి ప్రయోజనాలను ఆశించకుండా స్వచ్ఛమైన స్నేహంగా కొనసాగిందని నాజర్ వివరించారు. తొలి రోజుల్లో, తాను ఒక హోటల్‌లో తాను పనిచేస్తున్నప్పుడు, ఓ షూటింగ్‌లో చిరంజీవిని మొదటిసారి కలుసుకున్నానని నాజర్ గుర్తుచేసుకున్నారు. అప్పుడు చిరంజీవి తనను చూసి, ‘నాజర్, ఏం చేస్తున్నావ్? ఇంత మంచి నటుడివి, హోటల్‌లో పని చేయడం ఏమిటి? నాతో రా వేషాలిప్పిస్తానంటూ చిరు తనతో అన్నారని నాజర్ గుర్తు చేసుకున్నారు. అయితే, ఆ సమయంలో సినిమా రంగంపై తనకు నమ్మకం లేకపోవడం, నెలవారీ జీతం భద్రతను కోరుకోవడం వల్ల చిరు మాటను కాదన్నాని.. నాజర్ ఒప్పుకున్నారు. ఇక ఆ తర్వాత చిరంజీవి పెద్ద స్టార్ అయ్యారని.. గర్వంగా చెప్పారు నాజర్. ఆ తర్వాత తాను కూడా బాలచందర్ సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా మారనంటూ చెప్పుకొచ్చారు నాజర్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sridevi: జురాసిక్ పార్క్ సినిమా హీరోయిన్ ఛాన్స్ !! లైట్ తీసుకుని నో చెప్పిన శ్రీదేవి

బెంగళూరులో రూ.500తో రోజు గడవడం సాధ్యమేనా ??

ఎన్నికల తర్వాత పెట్రోల్ ధరలు ఎంత పెరుగుతాయంటే..!

Telangana Orange Alert: నిప్పుల కొలిమిలా తెలంగాణ.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *