Headlines

Jana Nayagan: విజయ్ ఆఖరి సినిమా అని ఏడాది కష్టపడితే ఇలా చేస్తారా? ఏడుస్తూ వీడియో రిలీజ్ చేసిన ప్రముఖ నటి

Jana Nayagan: విజయ్ ఆఖరి సినిమా అని ఏడాది కష్టపడితే ఇలా చేస్తారా? ఏడుస్తూ వీడియో రిలీజ్ చేసిన ప్రముఖ నటి


తమిళనాడు ముఖ్యమంత్రి, హీరో విజయ్ నటించిన ‘జన నాయగన్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా గత ఆరు నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు అన్నీ సమస్యలు తీరిపోవడంతో గురువారం (జులై 23) ప్రపంచ వ్యాప్తంగా విజయ్ సినిమా రిలీజైంది. అయితే తమిళంలో తప్పితే మిగతా అన్నీ చోట్లా ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వస్తోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు కూడా రూ. 50 కోట్ల లోపే వచ్చాయని తెలుస్తోంది. హెచ్ వినోద్ తెరకెక్కించిన జన నాయగన్ సినిమాలో భారీ తారాగణమే ఉంది. మమితా బైజు, పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాశ్ రాజ్.. ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే రిలీజ్ కు ముందే జన నాయగన్ సినిమాలోని పలు సీన్లకు సెన్సార్ బోర్డ్ కట్ చెప్పింది. అభ్యంతరకర సీన్లు, డైలాగులకు కత్తెర వేసింది. ఈ నేపథ్యంలోనే జన నాయగన్ సినిమాలోని తన సీన్లను కట్ చేసి పడేశారని తమిళ నటి ఆనందిత అజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన ఆమె తన బాధని బయటపెట్టింది.

‘జన నాయగన్ సినిమా కోసం నేను ఏడాది పాటు కష్టపడ్డాను. విజయ్ సర్‌తో నటించే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావించాను. కానీ చివరికి నా సీన్ కట్ చేయడంతో చాలా బాధగా ఉంది. ‘జన నాయగన్’ విజయ్ చివరి సినిమా అని అంతా చెబుతున్నారు. మళ్లీ ఆయనతో కలిసి పని చేసే అవకాశం కూడా లేదు కాబట్టి ఇంకా బాధగా అనిపిస్తోంది’ అని నటి ఆనందిత అజయ్ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ గామారింది.

ఇవి కూడా చదవండి



వీడియో ఇదిగో..

ఆనంది తమిళ సీరియల్స్ లో ఎక్కుగా నటిస్తోంది. ‘కార్తిగై పెంగళ్’, ‘యమునా’, ‘కనా కానుం కాలంగళ్’, ‘కల్లికట్టు పళ్లికూడం’ తదితర సీరియల్స్‌లో ఆనంది నటనకు మంచి పేరొచ్చింది. అంతేకాదు ఆనంది క్లాసికల్ డ్యాన్సర్ కూడా. ‘డాన్స్ జోడీ డాన్స్ 3.0’, ‘జోడి నెం.1’ సీజన్ 6, 7, ‘మానాడా మయిలాడా’ సీజన్ 7 తదితర డ్యాన్స్ రియాలిటీ షోల్లోనూ పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల సూర్య ‘కరుప్పు’, ‘గట్టకుస్తీ 2’ సినిమాల్లో వివిధ పాత్రలు పోషించిందీ ముద్దుగుమ్మ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *