Jagapathi Babu: ఆ సినిమా నుంచి చెప్పాపెట్టకుండా తీసేశారు.. చాలా బాధ అనిపించింది

Jagapathi Babu: ఆ సినిమా నుంచి చెప్పాపెట్టకుండా తీసేశారు.. చాలా బాధ అనిపించింది


ప్రముఖ నటుడు జగపతిబాబు తెలుగు చిత్ర పరిశ్రమలో తన సుదీర్ఘ ప్రయాణం, ఎదురైన అనుభవాలు, ఇతర భాషల సినీ రంగాలలో లభించే గౌరవం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి అన్ని భారతీయ భాషల్లో సినిమాలు చేస్తున్న జగపతిబాబు, తెలుగు పరిశ్రమలో తనకు లభిస్తున్న గౌరవం, పారితోషికం విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇతర భాషల పరిశ్రమల్లో తన పట్ల ఎక్కువ గౌరవంగా వ్యవహరిస్తారని, తెలుగులో మాత్రం “గర్కి ముర్గి దాల్ బరాబర్” (ఎక్కువ తేడా ఉండదు) అన్నట్లుగా చూస్తారని ఆయన అన్నారు. తన కెరీర్‌లో కష్టపడి నిర్ణయాలు తీసుకుని ఒక ఫేజ్‌కి చేరుకున్న తర్వాత కూడా తనను తేలికగా తీసుకోవడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పారితోషికం కంటే గౌరవానికే తాను ఎక్కువ ప్రాధాన్యతనిస్తానని జగపతిబాబు స్పష్టం చేశారు. ఎవరు తనకు గౌరవం ఇస్తారో వారితోనే పనిచేస్తానని, అది చిన్న సినిమా అయినా, రెమ్యూనరేషన్ లేకపోయినా, భారీ రెమ్యూనరేషన్ అయినా పర్వాలేదని తెలిపారు.

ఇది కూడా చదవండి : ఆ హీరో పిలిచి తిడతాడనుకున్నా.. కానీ ఆయన చేసిన పనికి షాక్ అయ్యా

గతంలో దాసరి నారాయణరావు, కృష్ణంరాజు వంటి మహానుభావులు అనుసరించినట్లుగానే, తన సొంత ఖర్చులు కారు పెట్రోల్, మినరల్ వాటర్, సహాయకుల ఖర్చులు  నిర్మాతలపై భారం వేయకుండా తానే చూసుకునే విధానాన్ని తాను దశాబ్దాలుగా పాటిస్తున్నానని జగపతిబాబు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఒక ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ సైతం తన ఇంటర్వ్యూలో ప్రస్తావించారని తెలిపారు. రాజమండ్రిలో షూటింగ్ కోసం వెళ్లినప్పుడు, తన ఫ్యామిలీతో కలిసి వచ్చినందుకు గాను తన వసతి, ప్రయాణ ఖర్చులను నిర్మాతకు స్వయంగా అందజేయడం ఆ నిర్మాతను ఆశ్చర్యపరిచిందని జగపతిబాబు వివరించారు. అలాంటి చిన్న విషయాలు నిర్మాతకు ఎంతో సంతోషాన్నిస్తాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఒకసారి విదేశీ షూటింగ్ వాయిదా పడినప్పుడు, రద్దు చేసుకున్న టికెట్ల వల్ల సుమారు 15 లక్షల రూపాయలు నష్టపోగా, వాటిని నిర్మాతను అడగకుండా స్వయంగా భరించానని జగపతిబాబు చెప్పారు. సినిమా విజయం ముఖ్యం కాబట్టి, అలాంటి చిన్న ఖర్చులను తాను పట్టించుకోనని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి : Talluri Rameswari: నా రెమ్యునరేషన్ గురించి ఆ స్టార్ హీరో అలా అనేసరికి షాక్ అయ్యా..!

గతంలో ఒక షూటింగ్ నిమిత్తం మాచర్ల తిరునాళ్ళకు హాజరైనప్పుడు, ప్రయాణ ఖర్చులు ఇచ్చినా తీసుకోకుండా కేవలం అభిమానులను కలవడం ద్వారానే సంతోషం పొందానని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. డబ్బు కన్నా సంబంధాలకు విలువ ఇచ్చే వ్యక్తిత్వం తనదని అప్పటి నుంచే ఉందని నొక్కి చెప్పారు. విలన్ పాత్రలకు మారిన తర్వాత పారితోషికం విషయంలో హీరోగా ఉన్నప్పుడు కంటే ఎక్కువ సంపాదిస్తున్నానని జగపతిబాబు తెలిపారు. హీరోగా కంటిన్యూస్ షెడ్యూల్స్ ఉండగా, విలన్ గా పర్ డే ప్రాతిపదికన పనిచేయడం వల్ల కొంత వ్యయప్రయాసలు ఉన్నా, మొత్తంగా ఎక్కువ ఆర్జిస్తున్నానని ఆయన వివరించారు. అయితే, పెద్ద బడ్జెట్ సినిమాల్లో తాను 3-4శాతం వాటా అడిగితే ఇవ్వడానికి వెనుకాడతారని, అది తనకు బాధ కలిగిస్తుందని తెలిపారు. ఇతరులు 10-20శాతం అడిగినా ఇస్తారని, తనను మాత్రం తక్కువకు వస్తాడని భావిస్తారని ఆయన వాపోయారు. ఏ కారణం లేకుండా ఒక సినిమా నుంచి తొలగించి, కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం తనను ఎంతో బాధించిందని జగపతిబాబు తెలిపారు. ఇలాంటి అనుభవం మూడు, నాలుగు సార్లు జరిగిందని పేర్కొన్నారు. ప్రొడ్యూసర్‌గానీ, డైరెక్టర్‌గానీ వచ్చి “పరిస్థితి ఇది” అని చెప్పి ఉంటే, తానూ ఏదో ఒక సానుకూల కారణం చెప్పి వైదొలిగి ఉండేవాడినని, కానీ తన మేనేజర్‌కు ఫోన్ చేసి తొలగించామని చెప్పడం సరైన పద్ధతి కాదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి : ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తా.. ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ మొదలు పెట్టిన రామ్ చరణ్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *