ఈ ఘటనలో షోరూమ్ సిబ్బంది రాజేష్, కమలహాసన్, మధుకర్, మస్తాన్ అనే నలుగురు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా, మధుకర్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనతో జ్యువెలరీ షాపుల్లో పనిచేసే సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి.దోపిడీ అనంతరం జ్యోతి నగర్ వైపు పారిపోయిన దుండగులు, ఆత్రుతలో బైక్‌పై నుంచి కిందపడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు బులెట్స్, ఒక మ్యాగజైన్‌ను అక్కడే వదిలిపెట్టారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని దర్యాప్తులో కీలక ఆధారాలుగా భావిస్తున్నారు.