ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో అక్కడి నుంచి వార్తలను అందించిన తొలి భారతీయ ఛానెల్‌గా టీవీ9 భారత్ వర్ష్ నిలిచింది. ఈ మేరకు భారత్ వర్ష్ రిపోర్టర్ సుమైరా ఖాన్ ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి గ్రౌండ్ రిపోర్టింగ్ చేస్తూ సమాచారం అందిస్తున్నారు. టెహ్రాన్‌లోని ఫ్రీడమ్ స్క్వేర్ సమీపం నుంచి రిపోర్టింగ్ చేస్తూ అక్కడ జరిగిన విధ్వంసం, క్షేత్రస్థాయి పరిస్థితులను వివరిస్తున్నారు. ఎప్పటికప్పుడు అక్కడి తాజా సమచారం, క్షేత్రస్థాయి పరిస్థితులను అందిస్తున్నారు. ఎన్నో కష్టాలు, సవాళ్ల మధ్య టెహ్రాన్ నుంచి సమాచారం పంపిస్తున్నారు. క్షిపణి దాడుల వల్ల కుదేలైన టెహ్రాన్‌లోని ఇంఖిలాబ్ వీధి, అజాదీ స్క్వేర్ సమీప ప్రాంతాలను ఆమె కవర్ చేస్తూ రిపోర్టింగ్ చేస్తున్నారు.
టెహ్రాన్ నుంచి ప్రత్యక్షప్రసారం
సుమైరా ఖాన్ రిపోర్టింగ్ చేస్తున్న ప్రాంతంలో అనేక భవనాలు క్షిపణి దాడులకు దెబ్బతిని ఉన్నాయి. అక్కడ అనేక హోటళ్లు, భవనాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే ప్రస్తుతం ఇరాన్ వాటిని వేగంగా పున:నిర్మించుకుంటోది. అయితే సుమైరా టెహ్రాన్ ప్రయాణం అంత సులువుగా జరగలేదు. తొలుత ఆమె విమానంలో ఇరాక్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత బాగ్దాద్, మెహ్రన్ సరిహద్దుల మీదుగా కారులో ప్రయాణించారు. మధ్యలో కొంతదూరం నడవాల్సి కూడా వచ్చింది. ఇది కష్టాలు పడి చివరకు టెహ్రాన్‌కు చేరుకున్నారు. టెహ్రాన్‌లో జనజీవనం ఎప్పటిలాగే కొనసాగుతుందని సుమైరా వివరించారు. ఇక ఇంకిలాబ్ వీధిలో అలీ ఖమేనీ ఫొటోను ఆమె చూపించారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ ప్రజలు ఐక్యంగా ఉన్నట్లు అక్కడి పరిస్థితులు ప్రతిబింబిస్తున్నాయి.
కాల్పుల విమరణ ఒప్పందం
ప్రస్తుతం అక్కడి పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. క్షిపణి దాడులు జరిగిన ప్రదేశం ఇదేనని సుమైరా ఖాన్ వివరించింది. ఇప్పటికీ ఆమె అక్కడ ఉండే సమాచారం అందిస్తున్నారు. మరికొద్ది రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. అయితే ఏప్రిల్ 8 నుంచి ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉంది. అయినా ఇరు దేశాల మధ్య ఇప్పటికీ మాటల యుద్దం కొనసాగుతోంది. ఇప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. అవసరమైతే యుద్దం మళ్లీ ప్రారంభిస్తామని ట్రంప్ ప్రకటన చేయగా.. అమెరికా చర్యలను తాము సహించలేమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ తెలిపారు.