Headlines

IPL 2027 Auction: ఇద్దరి మధ్య 26 ఏళ్ల గ్యాప్.. ఐపీఎల్ వేలంలో ఈ వింత చూశారా?


IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలం కోసం నమోదు చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో వయసు పరంగా ఒక ఆసక్తికరమైన భేదం కనిపించింది. ఆఫ్గనిస్తాన్ అనుభవజ్ఞుడు మొహమ్మద్ నబీ (41 సంవత్సరాలు) అత్యధిక వయస్కుడు కాగా, బీహార్‌కు చెందిన వాసుదేవ ప్రసాద్ సింగ్ (15 సంవత్సరాలు) అత్యల్ప వయస్కుడిగా నిలిచాడు.

ఇద్దరి మధ్య 26 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. వాసుదేవ పుట్టకముందే నబీ అంతర్జాతీయ క్రికెట్‌లో తన ముద్ర వేసేశాడు. 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నబీ అనుభవం, 15 ఏళ్ల వాసుదేవ యువశక్తి ఈ వేలంలో అత్యంత ఆసక్తికర కథనాలుగా మారాయి.

నబీ అద్భుతమైన కెరీర్..

అంతర్జాతీయ స్థాయిలో మొహమ్మద్ నబీ కెరీర్ చాలా సంపన్నమైనది. ఆఫ్గనిస్తాన్ తరఫున 3 టెస్టులు, 181 వన్డేలు, 155 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 33 పరుగులు, 8 వికెట్లు ఉన్నాయి. వన్డేల్లో 3,801 పరుగులు చేసి 181 వికెట్లు తీశాడు. టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో 2,509 పరుగులు చేసి 111 వికెట్లు సాధించాడు.

మరోవైపు, బీహార్‌కు చెందిన 15 ఏళ్ల వాసుదేవ ప్రసాద్ సింగ్‌కు వేలంలో నమోదు చేసుకోవడం పెద్ద వేదిక వైపు ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు. అతను నబీ కంటే 26 సంవత్సరాలు చిన్నవాడు. ఒక వైపు దశాబ్దాల అనుభవం ఉన్న నబీ, మరో వైపు కొత్త తరం వాసుదేవ చేరడంతో ఐపీఎల్ 2027 వేలంపై క్రికెట్ అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *