IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్(MI) పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా తయారైంది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న ముంబై.. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో అసలు ముంబై ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుందా? లేక ఇంకా ఏవైనా అవకాశాలు ఉన్నాయా? అనే ఆసక్తికర ఈక్వేషన్స్ చూద్దాం.
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ప్రయాణం చాలా క్లిష్టంగా మారింది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించిన ముంబై, పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అయితే మ్యాథమాటికల్ సినారియో, ముంబై ఇంకా రేసులో ఉంది. నిబంధనల ప్రకారం.. ఒక జట్టు 16 పాయింట్లు సాధిస్తే దాదాపు ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. ముంబైకి ఇంకా 6 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తే ముంబై 16 పాయింట్లతో నేరుగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది.
ముంబై ఇండియన్స్ తన మిగిలిన 6 మ్యాచ్‌ల్లో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా, ప్లేఆఫ్స్ చేరడం చాలా కష్టమవుతుంది. ఒకవేళ 6 లో 5 మ్యాచ్‌లు గెలిస్తే ఆ జట్టు పాయింట్లు 14కు చేరుతాయి. 14 పాయింట్లు ఉన్నప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ముంబై ఆధారపడాల్సి ఉంటుంది. అంటే టాప్ 4లో ఉన్న మిగిలిన జట్లు తమ మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని కోరుకోవాలి. అలాగే నెట్ రన్ రేట్ (-0.784) ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది కాబట్టి, వచ్చే మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తేనే రన్ రేట్ మెరుగుపడి ముంబైకి లబ్ధి చేకూరుతుంది.
ముంబై ఇండియన్స్ జట్టులో వ్యక్తిగత ప్రతిభకు కొదవలేదు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, జట్టుగా సమిష్టిగా రాణించలేకపోవడమే ప్రస్తుత సమస్య. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఫామ్ నిరూపించుకోవడంతో పాటు, జట్టును ఏకోన్ముఖంగా నడిపించాల్సి ఉంది. గతంలోనూ ముంబై జట్టు ఆరంభంలో ఓడిపోయి, ఆ తర్వాత అద్భుత విజయాలతో కమ్ బ్యాక్ ఇచ్చి టైటిల్స్ గెలిచిన చరిత్ర ఉంది. అందుకే అభిమానులు ముంబై మేజిక్ పై ఇంకా ఆశలు పెట్టుకున్నారు.
ముంబై ఆడబోయే మిగిలిన 6 మ్యాచ్‌ల్లో బలమైన జట్లు ఉన్నాయి. సొంత మైదానం వాంఖడేలో జరిగే మ్యాచ్‌లను ముంబై అనుకూలంగా మార్చుకోవాలి. రన్ రేట్ మెరుగుపడాలంటే బ్యాటర్లు క్రీజులో ఎక్కువ సేపు ఉండి భారీ స్కోర్లు సాధించాలి, బౌలర్లు ప్రత్యర్థులను తక్కువ పరుగులకే కట్టడి చేయాలి. 14 పాయింట్ల వద్ద టై ఏర్పడితే రన్ రేటే కీలకం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..