Headlines

IPL 2026 : కేకేఆర్‌కు బిగ్ షాక్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందే స్టార్ స్పిన్నర్ అవుట్?

IPL 2026 : కేకేఆర్‌కు బిగ్ షాక్.. ఆర్‌సీబీతో మ్యాచ్‌కు ముందే స్టార్ స్పిన్నర్ అవుట్?


IPL 2026 : ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో ఫామ్‌లోకి వచ్చిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మే 13న రాయ్‌పూర్‌ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న కీలక పోరుకు ముందు ఆ జట్టు మెయిన్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో కేకేఆర్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆదివారం రాత్రి హోటల్ లాబీలో వరుణ్ చక్రవర్తి నడుస్తున్న ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ఆయన ఎడమ కాలికి సపోర్టివ్ బ్రేస్ ధరించి, చేతిలో ఊతకర్ర పట్టుకుని నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఆయన చీలమండ లేదా పాదానికి తీవ్రమైన గాయం అయ్యిందని అర్థమవుతోంది. దీంతో బుధవారం ఆర్‌సీబీతో జరిగే మ్యాచ్‌లో వరుణ్ ఆడటం దాదాపు అసాధ్యమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

నిజానికి వరుణ్ చక్రవర్తికి గత వారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే గాయమైంది. ఆ మ్యాచ్‌లో తన కోటా 4 ఓవర్లు వేస్తున్నప్పుడు ఆయన కుంటుతూ కనిపించారు. నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన బౌండరీ లైన్ వద్ద వైద్య పరీక్షలు కూడా చేయించుకున్నారు. స్పెల్ ముగిసిన వెంటనే డగౌట్‌కు పరిమితమైన వరుణ్, అప్పటి నుంచి విశ్రాంతిలోనే ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా వేలి గాయంతో ఆడిన వరుణ్, ఇప్పుడు కాలి గాయంతో జట్టుకు దూరం కావడం కేకేఆర్‌కు పెద్ద మైనస్ అని చెప్పాలి.

కోల్‌కతా జట్టు పాయింట్ల పట్టికలో కింద ఉన్న దశలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించి జట్టును గెలుపు బాట పట్టించారు. గత నాలుగు మ్యాచ్‌లలో ఆయన 8 వికెట్లు తీశారు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆయన తీసిన మూడు వికెట్ల హాల్స్ కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. 10 మ్యాచ్‌ల్లో 10 వికెట్లతో నిలకడగా రాణిస్తున్న తరుణంలో ఆయన దూరం కావడం అజింక్యా రహానే సేనకు మింగుడు పడని విషయమే.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న కేకేఆర్‌కు ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే ఆర్‌సీబీపై గెలవడం చాలా అవసరం. ఒకవేళ వరుణ్ చక్రవర్తి అందుబాటులో లేకపోతే ఆయన స్థానంలో యంగ్ మిస్టరీ స్పిన్నర్ దక్ష్ కమ్రాను రంగంలోకి దించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. రాయ్‌పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే అంచనాల నేపథ్యంలో, వరుణ్ లేకపోతే కోల్‌కతా బౌలింగ్ విభాగం బలహీనపడే ప్రమాదం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *