Headlines

IPL 2026 : ఐపీఎల్ స్టార్ ప్లేయర్‌ అర్థరాత్రి మీటింగ్స్… బీసీసీఐ సీరియస్.. రంగంలోకి యాంటీ కరప్షన్ టీం

IPL 2026 : ఐపీఎల్ స్టార్ ప్లేయర్‌ అర్థరాత్రి మీటింగ్స్… బీసీసీఐ సీరియస్.. రంగంలోకి యాంటీ కరప్షన్ టీం


IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతుండగా, మైదానం వెలుపల ఆటగాళ్ల ప్రవర్తనపై బీసీసీఐ (BCCI) ఇప్పుడు నిఘా పెంచింది. ముఖ్యంగా హోటల్ గదుల్లో ఆటగాళ్లు అనధికారిక వ్యక్తులతో సమావేశం కావడంపై బోర్డు యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక సీనియర్ ప్లేయర్ తన గదిలో అర్థరాత్రి వరకు బయటి వ్యక్తులతో గడుపుతూ దొరికిపోవడంతో ఈ వివాదం ముదిరింది. ఇటీవల ఒక స్టార్ క్రికెటర్ తన హోటల్ రూమ్‌లో అర్థరాత్రి దాటాక కూడా పలువురు వ్యక్తులతో తరచుగా సమావేశమవుతున్నట్లు బీసీసీఐ అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై ఏసీయూ అధికారులు సదరు టీమ్ మేనేజర్‌ను వివరణ కోరగా, ఆయన చాలా అజాగ్రత్తగా సమాధానం ఇచ్చారు. ఆ ఆటగాడు జట్టులో చాలా సీనియర్ అని, అందుకే అడగలేకపోయామని చెప్పుకొచ్చారు. ఆటగాళ్లు తమకున్న ఇమేజ్‌ను అడ్డం పెట్టుకుని ఇలా నిబంధనలు ఉల్లంఘించడంపై బోర్డు అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

హోటల్ రూమ్‌లోకి ఎంట్రీ క్లోజ్

ఈ ఘటన తర్వాత బీసీసీఐ కొత్త నిబంధనలను కఠినతరం చేసింది. ఇకపై ఆటగాళ్లు తమ కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను హోటల్‌కు పిలవాలంటే ముందుగా టీమ్ మేనేజ్మెంట్ నుంచి రాతపూర్వక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అదీకాకుండా, రాత్రి 10 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి వ్యక్తులను గదుల్లోకి అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఎవరైనా కలవాలనుకుంటే కేవలం హోటల్ లాబీలో లేదా పబ్లిక్ ప్రదేశాల్లో మాత్రమే కలవాలని, అది కూడా మేనేజర్ నిఘాలోనే ఉండాలని ఆదేశించింది.

మరో వివాదంలో మరో ప్లేయర్

గతంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయని ఒక మాజీ అధికారి గుర్తు చేశారు. ఒక ప్లేయర్ అయితే టీమ్ మేనేజ్మెంట్ ఫోన్ చేసినా ఎత్తకుండా, అర్థరాత్రి తన స్నేహితులతో కలిసి హోటల్‌కు వచ్చారని సమాచారం. సదరు ప్లేయర్ ఫ్రాంచైజీ యజమానులకు అత్యంత సన్నిహితుడు కావడంతో మేనేజ్మెంట్ దీనిని తొక్కిపెట్టింది. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని, ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండానే ఈ చెక్-పోస్టులు ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *