క్రికెట్ మైదానంలో ఆటగాడిగా రాణించి, అదే గ్రౌండ్లో అంపైర్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అజితేష్ అర్గల్ జీవిత ప్రయాణం సరిగ్గా ఇలాగే సాగింది. ఒకప్పుడు విరాట్ కోహ్లీ సారథ్యంలో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అజితేష్, ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్లో అంపైర్‌గా అరంగేట్రం చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 2008 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ గుర్తుందా.? మలేషియాలో జరిగిన ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించడంలో అజితేష్ అర్గల్ కీలక పాత్ర పోషించారు. కేవలం 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన అతడు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఆ జట్టులో ఉన్న విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు అంతర్జాతీయ స్టార్లుగా ఎదిగితే, అజితేష్ మాత్రం దేశవాళీ క్రికెట్‌కు పరిమితమయ్యాడు. అయితే, ఆటపై ఉన్న మక్కువతో అతడు అంపైరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. బీసీసీఐ నిర్వహించిన అంపైరింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, మెల్లగా దేశవాళీ మ్యాచ్‌ల ద్వారా అనుభవం గడించాడు.
అజితేష్ అర్గల్ పట్టుదలకు ఫలితంగా ఐపీఎల్ 2026లో అంపైరింగ్ చేసే అవకాశం లభించింది. ఏ ప్లేయర్ అయితే ఒకప్పుడు తన జట్టులో ఆటగాడిగా ఉన్నాడో, ఇప్పుడు అదే స్టార్ ప్లేయర్లకు అంపైర్‌గా తీర్పులు చెబుతుండటం విశేషం. గిల్లీస్ నుంచి వైట్ కోటు వరకు అతడి ప్రయాణం ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకం. ఆటగాడిగా శిఖరాలను చేరుకోలేకపోయినా, క్రికెట్లోనే మరో రూపంలో రాణించవచ్చని అతడు నిరూపించారు. అజితేష్ తన రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఆటగాడిగా సాధించిన విజయాలనే పునరావృతం చేస్తారని ఆశిద్దాం.
Debut IPL match as an umpire for Ajitesh Argal. He won the 2008 U19 World Cup alongside Virat Kohli, with bowling figures of 5-2-7-2. pic.twitter.com/ZHetZf6fB4
— TukTuk Academy (@TukTuk_Academy) April 22, 2026
ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఉన్నా డబ్బులు ఎగ్గొట్టారా.? ఈ ఒక్క పని చేస్తే చాలు ఇంటికి తిరిగొస్తాయ్..