జీవితం అందరికీ పూలబాట పరచదు.. కొందరికి ముళ్లబాటలోనే పయనించడం నేర్పిస్తుంది. కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా, బాధ్యతల బరువును చిరునవ్వుతో మోసేవారే నిజమైన జీవిత పోరాట యోధులు. నిర్మల్‌కు చెందిన అశ్వినిగణేశ్ అలాంటి కోవకు చెందినదే ఈ మాతృమూర్తి. ఒకవైపు ఇద్దరు పసి పిల్లల ఆలనాపాలన, మరోవైపు కుటుంబ పోషణ కోసం ఉద్యోగం.. ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తూ ఆమె తన జీవితాన్ని ముందుకు నడిపిస్తోంది. చెత్త సేకరించే మున్సిపల్ వాహనానికి స్టీరింగ్ పట్టుకుని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను భుజాన వేసుకుంది. ఇంట్లో పిల్లలను చూసుకునేవారు లేక, వారిని ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్లలేని పరిస్థితి. మరోవైపు పని చేయకపోతే కుటుంబాన్ని పోషించలేని ఆర్థిక అవసరం. ఈ రెండు బాధ్యతల మధ్య ఆమె ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకుంది. పిల్లలను తనతోపాటే చెత్త సేకరణ వాహనంలో కూర్చోబెట్టుకుని విధులకు బయలుదేరుతుంది. ఒకవైపు పిల్లలపై కన్నేసి ఉంచుతూనే, మరోవైపు వాహనం నడుపుతూ తన బాధ్యతలను నిర్వర్తిస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్, రవినగర్, గొల్లపేట్, రెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో ఇల్లిల్లూ తిరుగుతూ చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. ఎండ, వానను లెక్కచేయకుండా రోజంతా రోడ్లపై ప్రయాణిస్తున్నా ఆమె ముఖంలో మాత్రం చెరగని చిరునవ్వు కనిపిస్తుంది. సాధారణంగా ఉద్యోగం చేసే తల్లులు పిల్లలను ఇంట్లో వదిలి వెళ్తుంటారు. కానీ అశ్వినికి ఆ అవకాశం లేకపోవడంతో పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ విధులను కొనసాగిస్తోంది. పరిస్థితులకు తలవంచకుండా తన కాళ్లపై తాను నిలబడేందుకు ఆమె చేస్తున్న ఈ ప్రయాణం కేవలం ఉపాధి కోసం మాత్రమే కాదు, ఇద్దరు బిడ్డల భవిష్యత్తు కోసం ఓ తల్లి చేస్తున్న అసాధారణ పోరాటం. చెత్తను సేకరిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే ఆమె.. తన పిల్లల భవిష్యత్తును మాత్రం బంగారంలా తీర్చిదిద్దాలన్న బలమైన సంకల్పంతో ముందుకు సాగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NHAI: వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు భారీగా ఫైన్!
New Building Rules: బిల్డింగ్ రూల్స్ మారుతున్నాయ్..ఇల్లు కట్టుకోవడం ఇక ఈజీ..
Samantha: గాయత్రీ హోమ ఫలితం.. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సమంత
సోయి లేకుంటే ఎలా.. అడ్డంగా మోసపోయింది..!
Nayanthara: నా జీవితంపై డాక్యుమెంటరీ ఎందుకు తీయకూడదు.. విమర్శకులకు నయన్ కౌంటర్!