Headlines

Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డుపై బ్లాస్టింగ్ బీభత్సం.. వరుసగా నాలుగు కార్లు ఢీ!


Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డుపై బ్లాస్టింగ్ బీభత్సం.. వరుసగా నాలుగు కార్లు ఢీ!

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పరిధిలో హిమాయత్ సాగర్ ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హెచ్ఎండీఏ చేపట్టిన రోడ్డు పనుల్లో భాగంగా నిర్వహించిన బ్లాస్టింగ్ ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది. బ్లాస్టింగ్ కారణంగా రాళ్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళ్లే మార్గంలో ఓఆర్ఆర్‌పై రాళ్లను గమనించకుండా వేగంగా వచ్చిన కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో వరుసగా నాలుగు కార్లు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో పలువురు వాహనదారులు గాయపడ్డారు. ఇద్దరికి కాళ్లు ఫ్రాక్చర్ కాగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు.

ఈ ప్రమాదం కారణంగా ఓఆర్ఆర్‌పై సుమారు రెండు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు బారులు తీరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు పనులు చేపట్టే సమయంలో తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ప్రమాదానికి కారణమని వాహనదారులు మండిపడుతున్నారు. బ్లాస్టింగ్ సమయంలో వాహనాల రాకపోకలను ఎందుకు నియంత్రించలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *