Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. త్వరలోనే వారికి పంపిణీ చేసేందుకు లైన్ క్లియర్..

Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. త్వరలోనే వారికి పంపిణీ చేసేందుకు లైన్ క్లియర్..


ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్. త్వరలో ఎల్-2 లబ్దిదారులకు ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. గత ప్రభుత్వంలో అసంపూర్తిగా నిర్మాణం ఆగిపోయిన 35,200 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ పథకంలో ఎల్-2 లబ్దిదారులకు అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి విడతలోని ఎల్-2 లబ్దిదారులకు వీటిని అందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీని వల్ల ఇళ్లు వినియోగంలోకి వస్తాయని, అంతేకాకుండా ఇళ్లు లేని పేదలకు లబ్ది చేకూరుతుందని భావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంపై అధికారులతో మంత్రి పొంగులేటి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

జూన్ నాటికి లక్ష ఇళ్లకు గృహ ప్రవేశం

తొలి విడతలో కేటాయించిన ఇళ్లల్లో జూన్ నాటికి లక్ష ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు. జూన్ మొదటి వారానికల్లా లక్ష ఇళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 3.25 లక్షల ఇళ్లను మంజూరు చేయగా.. ఇప్పటివరకు 2.66 లక్షల ఇళ్ల పనులు జరుగుతుననాయి. ఇక లబ్దిదారులకు బిల్లుల చెల్లింపులు వేగంగా జరపాలని మంత్రి తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయంలో మొదలుపెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు చాలా ప్రాంతాలు అసంతపూర్తిగా నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేసి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు అందించనున్నారు. ఇక భూభారతి కార్యక్రమంలో ఈ సమావేశంలో చర్చించారు. జిల్లాల మంత్రులు, కలెక్టర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం అర్హులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని పొంగులేటి ఆదేశించారు. అలాగే భూభారతి చట్టాన్ని మరింత పటిష్టం చేయాలని సూచించారు.

రెండో విడత జాబితా

తొలి విడతలో కొంతమందికి ఇళ్లను కేటాయించనుండగా.. రెండో విడత జాబితాపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలి జాబితాలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రయారిటీ ఇవ్వగా.. రెండో విడతలో పట్టణ, నగరాల్లోని పేదలకు ఇళ్లను కేటాయించనుంది. ఇప్పటికే అర్హులను గుర్తించగా.. త్వరలోనే ఇళ్లను మంజూరు చేయనుంది. అలాగే హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి అపార్ట్‌మెంట్లను ప్రభుత్వం నిర్మించనుంది. అనంతరం వీటిని పేదలకు అందించనుంది. ఇప్పటికే భూములను అధికారులు గుర్తించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *