ప్రస్తుతం తులం బంగారం రూ.1.5 లక్షలకు చేరుకుంది. దీంతో అత్యంత విలువైన ఆస్తిగా గోల్డ్ మారిపోయింది. దీంతో ఇళ్లు, షాపుల్లో ఉండే బంగారానికి ప్రమాదం పొంచి ఉంటుంది. దొంగతనం, దోపిడీ, అగ్ని ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు లాంటివి జరిగితే మీరు ఆర్ధికంగా నష్టపోవాల్సి ఉంటుంది. దీంతో వీటి నుంచి గోల్డ్ ఇన్యూరెన్స్ అనేది మీకు రక్షణ కల్పిస్తుంది. చాలామందికి బంగారానికి బీమా తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వల్ల దొంగతనం, ఇతర ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపోవాల్సి ఉంటుంది.